మేకపాటి ఢిల్లీ పర్యటన ఖరారు | Mekapati Goutham Reddy Delhi Tour Schedule | Sakshi
Sakshi News home page

మేకపాటి రెండురోజుల ఢిల్లీ పర్యటన

Published Wed, Sep 25 2019 10:20 AM | Last Updated on Wed, Sep 25 2019 11:30 AM

Mekapati Goutham Reddy Delhi Tour Schedule - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి రెండురోజుల ఢిల్లీ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన చేపట్టనున్నారు. అందులో భాగంగా ఆరుగురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. తొలిరోజైన బుధవారం కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, రవిశంకర్‌ ప్రసాద్‌, అరవింద్‌ గణపత్‌, అనురాగ్‌ ఠాకూర్‌లతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి అందించే ఆర్థికసాయం, నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై ప్రధానంగా చర్చించనున్నారు. ఐటీ ఇండస్ట్రీ పాలసీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల గురించి కూడా మాట్లాడనున్నారు. రెండోరోజైన బుధవారం కేంద్రమంత్రులు రాజ్‌కుమార్‌ సింగ్‌, రామేశ్వర్‌ తేలిలను కలిసే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement