శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా: ఇంట్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫీజు సరిచేయడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తూ విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన అనంతసాగరం మండలం బి. అగ్రహారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది.
గ్రామానికి చెందిన వెంకటకృష్ణారెడ్డి(28) అనే వ్యక్తి ఇంట్లో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ఏం జరిగిందో చూడటానికి ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.