మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులు (ఫైల్)
తిండి కలిగితె కండ కలదోయ్.. కండ కలవాడేను మనిషోయ్.. అనిప్రముఖ కవి గురజాడ అప్పారావు ఏనాడో చెప్పారు. నేటి బాలలే రేపటి పౌరులు. ఈనాటి వారి ఆరోగ్యమేరేపటి దేశానికి బలం. దీనిని బలంగా నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాఠశాలల్లో బాలల ఆరోగ్యం, చదువు, వసతులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇప్పటికే మన బడి నాడు–నేడు, కంటి వెలుగు, ఆరోగ్య పరీక్షల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన ఆయన ఇప్పుడు బాలలకు బలవర్థకమైన ఆహారం అందించేందుకు మధ్యాహ్న భోజన పథకంలో కొత్త మెనూ అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ వినూత్న పథకం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. దీంతోవిద్యార్థుల తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనం ఇక పసందుగా మారనుంది. విద్యార్థులకు రుచికరంగా పోషకాలతో కూడిన ఆహారం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా మెనూలో పెను మార్పులు చేసింది. పౌష్టికాహారానికి పెద్దపీట వేసింది. బాలల ఆరోగ్యమే ధ్యేయంగా ముందడుగు వేసింది. అలాగే వంట ఏజెన్సీ ఆయాల గౌరవ వేతనం కూడా రూ.3 వేలకు పెంచింది. మార్చిన మధ్యాహ్న భోజన మెనూ మంగళవారం నుంచి అమలు కానుంది.
ఇటీవల మధ్యాహ్న భోజన పథకంపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దని, అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన నాణ్యత ఉండాలని, ఎక్కడ తిన్నా రుచి ఒకేలా ఉండాల్సిందే అని, పులివెందులలో తిన్నా, అమరావతిలో తిన్నా రుచి మారకూడదని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో నాలుగు అంచెల్లో తనిఖీలు ఉండాలని సూచించారు. పిల్లలతో కలిసి పేరెంట్స్ కమిటీ కూడాభోజనం చేసి నాణ్యత పరిశీలించాలని పేర్కొన్నారు. గ్రామ సచివాలయం ద్వారా తనిఖీ నిర్వహించాలని సూచించారు. పొదుపు సంఘాలతో తనిఖీచేయించాలని, సెర్ప్ లేదా మరో సంస్థ ద్వారా కూడా తనిఖీలు చేయించాలని, తనిఖీల పర్యవేక్షణ మొత్తం ఆర్డీఓ చేపట్టాలని ఆదేశించారు.
ప్రత్యేక యాప్
ఇందు కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నారు. అలాగే గుడ్లు సరఫరాకు డివిజన్ స్థాయిలో టెండర్లు పిలవనున్నారు. చిక్కి (వేరుశెనగ ఉండలు) సరఫరాకు స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయనున్నారు. మారిన మెనూ ప్రకారం.. వంట ఏజెన్సీలకు చెల్లించే మొత్తం కూడా సర్కారు పెంచనుంది.
Comments
Please login to add a commentAdd a comment