మహబూబ్‌నగర్ వైద్యవిభాగం, న్యూస్‌లైన్: కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు ప్రజలకు చేస్తున్న మోసాలను ఎండగట్టాలని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయకర్‌రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ ఏర్పాటుకు చంద్రబాబు నిర్ణ యం తీసుకోవడం వల్లే కేంద్రంలో చల నం వచ్చిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్‌లో టీడీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహిం చారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ కు మ్మకై తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బలిదానల వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడబోతోందన్నారు. సిగ్గు లేని కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వల్లే తెలంగాణ వస్తుందని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే పార్టీని కాంగ్రెస్‌లో విలీ నం చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. విలీనంపై ఆయన డ్రామాలాడుతున్నారని ఆరోపిం చారు. కేసీఆర్ కుటుంబంలో ప్రతి ఒక్క రూ ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. జిల్లా ఆభివృద్ధి గురించిఒక్కరోజైనా పార్లమెం ట్‌లో ప్రస్తావించారా అని ప్రశ్నించారు. ఎంపీగా గెలిచి జిల్లాకు చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు. తాండూరు ఎమ్యెల్యే మహేందర్‌రెడ్డి, ములుగు ఎమ్యెల్యే సీతక్క, నర్సంపేట ఎమ్యెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెం దిందని చెప్పారు.
రాష్ట్రంలో ధ్రుతరాష్ట్ర పా లన సాగుతోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చంద్రబాబు విశేష కృషి చేశారని చెప్పారు. కానీ తమ వల్లే రాష్ట్రం ఏర్పడబోతోందని టీఆర్‌ఎస్, కాం గ్రెస్ నేతలు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి మోసాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా ఎమ్యెల్యేలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పి.రాములు, జైపాల్ యాదవ్, దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పా టు అన్నారు.
సోనియా జపం చేస్తున్న కొందరు నాయకులు ఆమెకు గుడి కట్టిస్తామని చెప్పాడం చూస్తే నవ్వొస్తుందని అన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులకు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే ఉద్యమంలో ప్రాణాలు పోగొట్టుకున్న శ్రీకాంతచారి, జిల్లాకు చెందిన సువర్ణతో పాటు ప్రొఫెసర్ జయశంకర్‌లకు గుడి కట్టించాలని సూచించారు. వచ్చేఎన్నికల్లో జిల్లాలో 14ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు, నాయకులు రాజేశ్వర్‌గౌడ్, ఎన్‌పీ వెంకటేశ్, నాగేశ్వర్‌రెడ్డి, జయశ్రీ, రాధిక, నాగేశ్వర్‌రెడ్డి, సమద్‌ఖాన్, పగిడాల శ్రీను కృష్ణమోహన్ పాల్గొన్నారు.
విలీనంపై కేసీఆర్ డ్రామాలు
Published Mon, Jan 20 2014 4:22 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement