
గంటా శ్రీనివాసరావు (ఫైల్‌ఫోటో)
సాక్షి, అమరావతి: ఇటీవల రాయలసీమ విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ పై దాడికి యత్నించిన ఘటనపై స్పందించిన గంటా దాడికి యత్నించిన శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ ఫ్రోపెసర్ రతనప్ప చౌదరిని సస్పండ్ చేయాలని యూనివర్సిటీ ఇన్‌చార్జ్ వీసీను ఆదేశించారు. ఘటనకు కారకులైన డీఎడ్ కళాశాలల కరస్పాండెంట్ తిరుపతయ్యపై వేటు వేయాలన్నారు. తిరుపతయ్య కళాశాలల అఫిలియేషన్ రద్దు చేయాలని రాయలసీమ వర్సిటీ వీసిని ఆదేశించారు. ఉన్నతాధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే సహించేదిలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment