
దాదా.. సమైక్యంగా ఉంచండి: శైలజానాథ్
రాష్ట్రం సమైక్యంగా ఉండేలా చూడాలని అనంతపురం పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్ర మంత్రి సాకే శైలజానాథ్ విజ్ఞప్తి చేశారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శతజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని శైలజానాథ్ అనంతపురంలో కలిశారు.
ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంటు రాష్ట్రపతికి బాగా తెలుసని, మెజారిటీ ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే కోరుకుంటున్నారని ఈ సందర్భంగా శైలజానాథ్ తెలిపారు.