
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఎండ ఎక్కువగా ఉండటంతో వడదెబ్బకు గురయ్యారని పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు.
భీమవరంలో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారని, అయినా సోమవారం పాదయాత్ర యథాతథంగా కొనసాగిస్తారన్నారు.