మౌలిక సదుపాయల మిషన్‌కు విశాఖలో నేడు శ్రీకారం | mission of basic facilities in the room today | Sakshi
Sakshi News home page

మౌలిక సదుపాయల మిషన్‌కు విశాఖలో నేడు శ్రీకారం

Published Fri, Mar 13 2015 1:40 AM | Last Updated on Thu, Oct 4 2018 5:44 PM

mission of basic facilities in the room today

{పారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
కాకినాడ పోర్టులో ఏడవ బెర్త్ ఏర్పాటు

 
విశాఖపట్నం: రాష్ర్ట సత్వర ప్రగతికోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడు మిషన్లలో కీలకమైన మౌలిక సదుపాయల మిషన్‌ను శుక్రవారం విశాఖలో ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ మిషన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  స్థానిక నోవొటెల్‌లో జరిగే కార్యక్రమంలో ప్రారంభించ నున్నారు. సుమారు 500 మంది పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడుదారులు ఈకార్యక్రమంలో పాల్గోనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో తొలుత ‘పోర్టుల ఆధారిత లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ’ అనే అంశంపై చర్చాగోష్టిని చేపట్టనున్నారు.

మధ్యాహ్నం 2.30 గంటలకు పారిశ్రామిక కారిడార్‌లు- మౌలికాంశాల అభివృద్ధి అనే అంశంపై మరో చర్చాగోష్టి జరగనుంది. మిషన్ ప్రారంభం రోజునే రాష్ర్టంలో మౌలిక సదుపాయల అభివృద్ధికి సంబంధించి పలు పారిశ్రామిక, పెట్టుబడుల సంస్థలతో కొన్ని కీలక ఒప్పందాలపై ముఖ్యమంత్రి చంద్ర బాబు సమక్షంలో చేయనున్నారు. కాకినాడ పోర్టులో ఏడవ బెర్త్ ఏర్పాటు, ఏపీ గ్యాస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం-కాకినాడల మధ్య గ్యాస్ పైపులైన్ ఏర్పాటు, జీఎంఆర్, కోనసీమ పవర్‌సంస్థలతో ఒప్పందాలు జరుగనున్నాయి.  ప్రతిష్టాత్మక కంపెనీలు కార్యక్రమంలో భాగస్వామ్యం కాబోతున్నాయి.

సీఈఒలతో సీఎం ముఖాముఖి: ఈ కార్యక్రమంలో పాల్గొనేం దుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకోనున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ఈకార్యక్రమానికి హాజరు కానున్న చంద్రబాబు పారిశ్రామి క వేత్తలు, పెట్టుబడిదారులతో ముఖాముఖిలో పాల్గోనున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement