
వనమా వెంకటేశ్వర రావు(కొండబాబు)
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికపై స్పందించడానికి టిడిపి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు(కొండబాబు)నిరాకరించారు. ఏపీ రాజధానిగా కాకినాడను చేయరన్నారు. ఇక దాని గురించి మాట్లాడటం దండగ అని ఆయన అన్నారు.
రాజధాని విషయంపై మాట్లాడేందుకు తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి మండలి ఉందని ఆయన తెలిపారు. ఈ అంశంపై మాట్లాడటానికి ఆయన ఇష్టపడలేదు.