
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి.. వైద్యుల పనితీరుపై ఆరా తీశారు. ఆసుప్రతిలో వైద్య సేవలు, సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులను కోరారు.
రిమ్స్ ఆసుపత్రిని పరిశీలించిన ప్రిన్సిపాల్ సెక్రటరీ..
రిమ్స్ సర్వజన వైద్యశాలలో ప్రిన్సిపాల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య శాఖ ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, వసతులపై ఆరా తీశారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి చెందిన డెంటల్ కళాశాలను కూడా అధికారులు పరిశీలించారు.