Proddatur Govt Hospital
-
వైద్య సేవలపై ఎమ్మెల్యే రాచమల్లు ఆరా..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి.. వైద్యుల పనితీరుపై ఆరా తీశారు. ఆసుప్రతిలో వైద్య సేవలు, సౌకర్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులను కోరారు. రిమ్స్ ఆసుపత్రిని పరిశీలించిన ప్రిన్సిపాల్ సెక్రటరీ.. రిమ్స్ సర్వజన వైద్యశాలలో ప్రిన్సిపాల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య శాఖ ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, వసతులపై ఆరా తీశారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి చెందిన డెంటల్ కళాశాలను కూడా అధికారులు పరిశీలించారు. -
ఆటో, బస్సు ఢీ... ముగ్గురికి గాయాలు
ఎర్రగుంట్ల: కర్చుకుంటపల్లి క్రాస్ రోడ్డులో శనివారం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్చుకుంటపల్లెకు చెందిన ఓబుళరెడ్డి, సుహాసిని ప్రొద్దుటూరులోని ఆస్పత్రికి చూపించుకోవడానికి ఆటోలో వెళ్తున్నారు. అదే సమయంలో చిలంకూరు నుంచి చిన్నకత్తెరపల్లెకు ఆర్టీసీ బస్సు వస్తోంది. ఎదురెదురుగా వస్తున్న– వెళ్తున్న ఈ వాహనాలు ఢీన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఓబుళరెడ్డి, సువాసిని, మునెమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. బాధితులకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి వైద్య సేవలు అందించి పరామర్శించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నారాయణ యాదవ్ తెలిపారు. -
లారీ ఢీకొని వృద్ధురాలు మృతి
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్లలోని నాలుగు రోడ్ల కూడలిలో లారీ ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆమె పట్టణంలో చాలా కాలం నుంచి దుకాణాలు, హోటళ్ల వద్ద భిక్షాటన చేస్తూ జీవించేది. ఈ క్రమంలో శనివారం ఉదయం రోడ్డుపై వెళ్తున్న ఆమెను ముద్దనూరు వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైంది. బాధితురాలిని స్థానికులు 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆమెకు 60 ఏళ్లు ఉండవచ్చని వారు పేర్కొన్నారు. మృతురాలి ఆచూకీ తెలియకపోవడంతో గుర్తు తెలియని మహిళ మృతిగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నారాయణయాదవ్ తెలిపారు.