
ఆటో, బస్సు ఢీ... ముగ్గురికి గాయాలు
కర్చుకుంటపల్లి క్రాస్ రోడ్డులో శనివారం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి.
ఎర్రగుంట్ల: కర్చుకుంటపల్లి క్రాస్ రోడ్డులో శనివారం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్చుకుంటపల్లెకు చెందిన ఓబుళరెడ్డి, సుహాసిని ప్రొద్దుటూరులోని ఆస్పత్రికి చూపించుకోవడానికి ఆటోలో వెళ్తున్నారు. అదే సమయంలో చిలంకూరు నుంచి చిన్నకత్తెరపల్లెకు ఆర్టీసీ బస్సు వస్తోంది. ఎదురెదురుగా వస్తున్న– వెళ్తున్న ఈ వాహనాలు ఢీన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఓబుళరెడ్డి, సువాసిని, మునెమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. బాధితులకు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి వైద్య సేవలు అందించి పరామర్శించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నారాయణ యాదవ్ తెలిపారు.