‘తొలిసంతకం అపహాస్యం చేసిన ఘనుడు బాబే’ | MLC umareddy venkateswarlu criticize the tdp government | Sakshi
Sakshi News home page

‘తొలిసంతకం అపహాస్యం చేసిన ఘనుడు బాబే’

Published Sun, Jun 25 2017 4:16 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

‘తొలిసంతకం అపహాస్యం చేసిన ఘనుడు బాబే’ - Sakshi

‘తొలిసంతకం అపహాస్యం చేసిన ఘనుడు బాబే’

ఏలూరు: తొలి సంతకాలను అపహాస్యం చేసిన ఘనుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్‌సీపీ అగ్రనేత ఉమ్మారెడ్డి వెంటకటేశ్వర్లు అన్నారు. మండలంలో ఆదివారం వైఎస్సార్‌సీపీ ప్లీనరీ జరిగింది. సమావేశంలో ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో దుర్మార్గపాలన సాగుతోందన్నారు. అసెంబ్లీలో ప్రశ్నించే ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. బెల్లు షాపులను తొలగిస్తామని తొలిసంతకం చేసిన తర్వాత 4 వేల మద్యం షాపులు, 40 వేల బెల్టు షాపులు పెరిగాయని చెప్పారు. దశలవారీగా మద్య నిషేదమని సంతకం చేసి మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని రూ.14 వేల కోట్లకు పెంచుకున్నారని తెలిపారు.  రుణమాఫీ సంతకమంటూ కోటయ్య సంతకం చేసిన ఘనుడు చంద్రబాబు అని ఆయన పేర్కొన్నారు. రూ.86 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని రైతులకు హామీనిచ్చారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 9వేల కోట్లే మాఫీ చేసి మోసం చేశారని తెలిపారు. రైతుల ఆత్మహత్యకు చంద్రబాబు దౌర్భగ్యపు పరిపాలనే కారణమని వివరించారు. ఇఫ్తార్ విందులో రాజకీయ ప్రసంగం చేసిన సీఎం ముస్లింలను అవమానపరిచారని చెప్పారు. నా రోడ్లు, నా పెన్షన్‌ అంటూ చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముస్లిం, గిరిజనులకు క్యాబినెట్‌లో ప్రాతినిద్యం లేకుండా చేశారని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకుని గవర్నర్‌, స్పీకర్‌ వ్యవస్థలను అవహాస్యం చేశారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమలో 15 అసెంబ్లీ స్థానాలు వైఎస్సార్సీపీవేనని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జోస్యం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement