umareddy Venkateswarlu
-
‘పాదయాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా’
-
‘పాదయాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా’
సాక్షి, తాడేపల్లి : వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో చేసిన ప్రజాసంకల్పయాత్ర రాష్ట్ర స్థితిగతిని మార్చివేసిన పాదయాత్ర అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన ప్రజల్లో మమేకమై ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకున్నారని గుర్తుచేశారు. ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర ముగిసి నేటికి ఏడాది పూరైన సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ నందిగం సురేష్‌లు పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ.. దేశ చరిత్రలో సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర నిలిచిపోతుంది. ప్రజాసంకల్పయాత్ర రాష్ట్ర స్థితిగతిని మార్చివేసింది. చరిత్రలో నిలిచిపోయే పాదయాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. వైఎస్ జగన్‌తో కలిసి పాదయాత్రలో అడుగులో అడుగు వేయడం సంతోషాన్నిచ్చింది. కోట్లాది మంది ప్రజలు వైఎస్ జగన్ మీద నమ్మకం పెట్టుకున్నారు. రికార్డు స్థాయిలో 3648 కి.మీ పాదయాత్ర చేశారు. మే 23న వైఎస్ జగన్‌పై ప్రజలకు ఎంత అభిమానం ఉందో బయటపడింది. 151 సీట్లలో వైఎస్సార్సీపీకి కట్టబెట్టారు. గాలికి వదిలేసిన సంక్షేమాన్ని సీఎం వైఎస్ జగన్ గాడిలో పెడుతున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన 80 శాతం హామీలను రెండు మూడు నెలల్లోనే అమలు చేశారు. చెప్పని హామీలను కూడా అమలు చేసి చూపిస్తున్నార’ని తెలిపారు. ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తానని చెబితే అందరు ఆశ్చర్యపోయారని అన్నారు. సుదీర్ఘంగా 3648 కి.మీ సాగిన పాదయాత్రలో ఆయన 2 కోట్ల మందిని కలుసుకున్నారని తెలిపారు. పేదలు పడుతున్న కష్టాలను కళ్లారా చూశారని చెప్పారు. పాదయాత్రలో చూసిన కష్టాలను తీర్చడం కోసం నవరత్నాలను ప్రవేశపెట్టారని.. మొదటి ఆరు నెలల్లోనే సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చారని వెల్లడించారు. సీఎం జగన్ చారిత్రాత్మక పథకాలను ప్రవేశపెడుతున్నారని కొనియాడారు. నందిగం సురేశ్ మాట్లాడుతూ.. పాదయాత్రను వైఎస్ జగన్మోహన్రెడ్డి పండగలా ప్రారంభించారని గుర్తుచేశారు. పాదయాత్ర సమయంలో ఆయనను ఎన్నో ఇబ్బందులు పెట్టారని.. కానీ ప్రజల కోసం వైఎస్ జగన్ 3,648 కి.మీ పాదయాత్ర చేశారని తెలిపారు. దళిత కుటుంబంలో పుట్టిన తనను ఎంపీగా చేశారని.. ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టారని చెప్పారు. -
తెలంగాణ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్‌కు ఘన నివాళి
-
బాబు నాలుగేళ్ల పాలనపై వైఎస్సార్ సీపీ ఛార్జ్‌షీట్
-
చంద్రబాబు పాలనపై వైఎస్సార్ సీపీ ఛార్జ్‌షీట్
సాక్షి, హైదరాబాద్ : నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనపై ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. టీడీపీ సర్కార్‌లో అభివృద్ధి శూన్యమని, అందువల్లే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్ విడుదల చేస్తున్నామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందే తప్ప, అంగుళం కూడా అభివృద్ధి లేదు. ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీ దగ్గర నుంచీ, కీలక పాత్ర నిర్వహిస్తున్న వెంకయ్య నాయుడు దగ్గర నుంచీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, సీఎం కావాలని ఉవ్విళ్లు ఊరుతున్న చంద్రబాబు వరకూ ప్రత్యేక హోదా అయిదేళ్లు కాదు, పదేళ్లు ...కాదు పదిహేనేళ్లు కావాలని డిమాండ్ చేశారు. హోదా స్థానంలో ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉందని చంద్రబాబు మాట్లాడారు. నాలుగేళ్లు అయిన తర్వాత మాట మార్చి ఇప్పుడు కేంద్రాన్ని దుయ్యబడుతున్నారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ సీపీ ఛార్జ్‌షీట్, టీడీపీ మ్యానిఫెస్టో దగ్గర పెట్టుకుని సరి చూసుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారు. బీజేపీ, జనసేన మద్దతు తీసుకుని గెలిచిన టీడీపీ... ఇప్పుడు బాబు హామీలు నెరవేర్చకపోవడంతో బీజేపీ, జనసేన పార్టీలు విడిపోయాయి. చంద్రబాబు ఇసుక, మైనింగ్, మద్యం మాఫియాను పెంచి పోషించారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు. రైతుల రుణమాఫీనే తొలిసంతకం అని ఊదరగొట్టిన చంద్రబాబు... ఇప్పుడు రైతాంగాన్ని చూసి సిగ్గుపడాలి’ అని మండిపడ్డారు. పూర్తి సారాంశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘తొలిసంతకం అపహాస్యం చేసిన ఘనుడు బాబే’
ఏలూరు: తొలి సంతకాలను అపహాస్యం చేసిన ఘనుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్సీపీ అగ్రనేత ఉమ్మారెడ్డి వెంటకటేశ్వర్లు అన్నారు. మండలంలో ఆదివారం వైఎస్సార్సీపీ ప్లీనరీ జరిగింది. సమావేశంలో ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో దుర్మార్గపాలన సాగుతోందన్నారు. అసెంబ్లీలో ప్రశ్నించే ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. బెల్లు షాపులను తొలగిస్తామని తొలిసంతకం చేసిన తర్వాత 4 వేల మద్యం షాపులు, 40 వేల బెల్టు షాపులు పెరిగాయని చెప్పారు. దశలవారీగా మద్య నిషేదమని సంతకం చేసి మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని రూ.14 వేల కోట్లకు పెంచుకున్నారని తెలిపారు. రుణమాఫీ సంతకమంటూ కోటయ్య సంతకం చేసిన ఘనుడు చంద్రబాబు అని ఆయన పేర్కొన్నారు. రూ.86 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని రైతులకు హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 9వేల కోట్లే మాఫీ చేసి మోసం చేశారని తెలిపారు. రైతుల ఆత్మహత్యకు చంద్రబాబు దౌర్భగ్యపు పరిపాలనే కారణమని వివరించారు. ఇఫ్తార్ విందులో రాజకీయ ప్రసంగం చేసిన సీఎం ముస్లింలను అవమానపరిచారని చెప్పారు. నా రోడ్లు, నా పెన్షన్ అంటూ చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముస్లిం, గిరిజనులకు క్యాబినెట్లో ప్రాతినిద్యం లేకుండా చేశారని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకుని గవర్నర్, స్పీకర్ వ్యవస్థలను అవహాస్యం చేశారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమలో 15 అసెంబ్లీ స్థానాలు వైఎస్సార్సీపీవేనని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జోస్యం చెప్పారు. -
'హోదాపై బాబు సమాధానం చెప్పాలి'
రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా అనే విషయం చర్చనీయాంశమైందని, హోదా వస్తుందా..రాదా అనే విషయంపై ప్రజలకు వాస్తవాలను చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. దాచేపల్లి మండలం పొందుగల గ్రామంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని, ఈ అంశంపై ప్రజలకు బాబు స్పష్టమైన నిజాలు చెప్పాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ, టీడీపీల మ్యాన్ఫెస్టోలో కూడా పొందుపర్చారని, బీజేపీ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు హోదా కోసం కేంద్రంపై వత్తిడి ఎందుకు తీసుకురాలేకపోతున్నారో ప్రజలు వివరించాలన్నారు. అధికారంలోకి రాకముందు ప్రత్యేకహోదా కావాలన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆర్నేల్లకే హోదా సంజీవని కాదని వ్యాఖ్యానించటం చిత్తశుద్ధిని తెలియజేస్తుందని పేర్కొన్నారు. హోదా అంశంపై కేంద్రం చంద్రబాబుపై వత్తిడి చేసి, రాష్ట్రంలోని ప్రతిక్షపార్టీలను కేంద్రం వద్దకు తీసుకెళ్లాలని, హోదా ప్రాధాన్యతను ప్రతిపక్షపార్టీలు వివరిస్తాయని చెప్పుతున్నా పట్టించుకోవటంలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తర భారతదేశంలోని 10 రాష్ట్రాలకు హోదా ఉండటం వలనే అభివృద్ధి చెందాయని, హోదా లేకపోతే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు అభివృద్ధి చెందటం సాధ్యపడదన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో రాష్ట్రంలో జరిగిన పారిశ్రామిక వేత్తల సమావేశంలో హోదా వస్తుందనే భావనతో రూ4.65లక్షల కోట్లతో పరిశ్రమలు స్థాపించేందుకు అంగీకారం తెలిపారని, హోదా రాకపోవటం వలన ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రంలో నెలకొల్పలేదని ఆయన అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రపతి నుంచి కేంద్రమంత్రులు, గవర్నర్‌ను కలిసి హోదా అవశ్యకతను వివరించారని, హోదా కోసం సభలు, రాస్తారోకోలు, నిరాహారదీక్షలు చేపట్టారని ఆయన గుర్తుచేశారు. ప్రతిపక్షపార్టీగా హోదా కోసం శక్తికి మించి పోరాడుతున్నామని, హోదా వచ్చేంత వరకు పోరాటంను ఆపేదిలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారపార్టీ అరచకాలు ఎక్కువైయ్యాయని, వచ్చే ఎన్నికల్లో డబ్బుతో గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.