
కళ్యాణదుర్గం: బ్రహ్మసముద్రం మండలంలోని ఓ గ్రామంలో వివాహితపై టీడీపీ కార్యకర్త మోటా మహేష్ అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలు తెలిపిన మేరకు.. శనివారం మధ్యాహ్నం వివాహిత ఒంటరిగా ఉండటం గమనించి మహేష్ ఇంట్లోకి దూరాడు. అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. అయినా అతను వదలకుండా హింసించసాగాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గట్టిగా కేకలు వేస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. సమీపంలో ఉన్న బాధితురాలి ఒదినకు విషయం తెలిసింది. వెంటనే ఆమె బాధితురాలి తండ్రికి సమాచారమందించింది.
ఆయన హుటాహుటిన ఇంటి వద్దకు చేరుకోగానే మహేష్ ఒక్క ఉదుటున తోసేశాడు. అంతేకాదు ఆయన కాలిని పురితిప్పి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు తేరుకున్నాక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. అనంతరం ఆమెను కుటుంబ సభ్యులు కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. రూరల్ ఎస్‌ఐ నబీరసూల్ బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. సీఐ శివప్రసాద్‌ను వివరణ కోరగా సంఘటనపై పూర్తి స్థాయిలో విచారించాక వాస్తవాలను తెలుసుకుంటామన్నారు. కాగా బ్రహ్మసముద్రం ఎస్‌ఐ అబ్దుల్ రెహ్మాన్‌ను వివరణ కోరగా...మోటా మహేష్, వివాహిత తండ్రి గొడవ పడ్డారని, అత్యాచారయత్నం కేసు పెట్టారేమో సరిగా తెలియదంటూ చెప్పడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment