Anantapur: Case Against Young Man Harassing Married Woman - Sakshi
Sakshi News home page

పెళ్లై మెట్టినింటికి వెళ్లిన యువతికి ఫోన్‌ చేసి కోరిక తీర్చాలంటూ..

Nov 12 2021 9:46 AM | Updated on Nov 12 2021 10:52 AM

Case Against Young Man Harassing Married Woman Anantapur - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నల్లమాడ (అనంతపురం): వివాహితను లైంగికంగా వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ యల్లంరాజు గురువారం రాత్రి నల్లమాడ పోలీస్‌ స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. దొన్నికోటకు చెందిన గిరిజన యువతి గతంలో వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలోని ఆస్పత్రిలో పనిచేసింది. ఆ సమయంలో అక్కడే పనిచేసిన యల్లనూరు మండలం కల్లూరుకు చెందిన నవీన్‌తో పరిచయమైంది. ఆరు నెలల క్రితం యువతికి కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి మండలం ఎం.చెర్లోపల్లికి చెందిన వ్యక్తితో వివాహమైంది.

చదవండి: (ఆ ప్రేమికుల్ని బలవంతంగా బంధించి.. పూలు చల్లి, పెళ్లి చేసి.. యువతి శరీరంపై..)

ఆస్పత్రిలో పనిచేస్తున్నపుడు ఏర్పడిన పరిచయాన్ని ఆసరా చేసుకున్న నవీన్‌.. పెళ్లై మెట్టినింటికి వెళ్లిన యువతికి ఫోన్‌ చేసి కోరిక తీర్చాలంటూ వేధించేవాడు. భర్తకు విషయం తెలియడంతో ఆమెను పుట్టింటికి పంపించేశాడు. నవీన్‌ నుంచి తనను, కుటుంబాన్ని కాపాడి, కాపురాన్ని నిలబెట్టాలని ఓ వీడియో ద్వారా కలెక్టర్, ఎస్పీలను కోరింది. ఈ వీడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, లైంగిక వేధింపులు, బెదిరింపుల కేసు నమోదు చేసి, నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కదిరి డీఎస్పీ విచారణ చేయాల్సి ఉంది. కాగా బాధిత యువతి బుధవారం ఎస్పీ ఫక్కీరప్పను కూడా కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.   

చదవండి: ('నూటొక్క జిల్లాల అందగాడు': విగ్గుతో అమ్మాయిలకు వలేస్తాడు.. ఆ తర్వాత..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement