► గ్యాస్ కనెక్షన్లకు నంబర్ల పేరుతో కుచ్చుటోపీ
► ఒక్కో ఇంటి నుంచి రూ.25 వసూలు
► నంబర్ వేయించుకోకపోతే కనెక్షన్ కట్ అంటూ బ్లాక్‌మెయిల్
► రూ.10 లక్షలకు పైగా దోచుకునేందుకు పన్నాగం
ధర్మవరం: ‘మీ ఇంటికి హెచ్‌పీ గ్యాస్ కనెక్షన్ ఉంది. కాబట్టి మీ గ్యాస్ నంబర్ రేకుమీద స్టిక్కర్‌గా అతికించి మీ ఇంటికి వేస్తాం. ఇందుకు రూ.25 ఇవ్వాలి. ఇలా వేయించుకోకపోతే గ్యాస్ కనెక్షన్ కట్ చేయిస్తాం.’ అంటూ కొందరు యువకులు ధర్మవరం పట్టణంలో ఇంటింటా తిరుగుతూ ప్రజల నుంచి డబ్బు లాగుతున్నారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 72,984 నివాసాలున్నాయి. వీటిలో దాదాపు 43వేల ఇళ్లకు గ్యాస్ కనెక్షన్లు ఉంటాయి. ఒక్కో ఇంటి నుంచి రూ.25 చొప్పున వసూలు చేసినా రూ.10 లక్షలకు పైగా అవుతుంది. ఈ వ్యవహారాన్ని కొందరు తెరచాటున నడిపిస్తున్నారు.
ఇళ్ల వద్దకు వచ్చిన యువకులు మాత్రం ‘మాకు గ్యాస్ ఆఫీస్‌లోని వ్యక్తులు చెప్పారు’ అని అంటున్నారు. ఇప్పటికే పట్టణంలోని చాలా వార్డుల్లో గ్యాస్ నంబర్ స్టిక్కర్లు అతికించి డబ్బు వసూలు చేశారు. గ్యాస్ రాదేమోనన్న భయంతో ప్రజలు కూడా రూ.25 చెల్లిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారి ఇళ్లకు మాత్రం నంబర్ ప్లేట్ కొట్టకుండా మెల్లగా జారుకుంటున్నారు. ప్రజలను ఏవిధంగానైనా మోసం చేసేందుకు కొందరు ఈ తతంగాన్ని నడుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పెద్దఎత్తున వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని అడ్డుకోకపోతే ప్రజలు మోసపోవడంతోపాటు గ్యాస్ కనెక్షన్లు సైతం తొలగించుకుని కొత్త కంపెనీలవైపు మొగ్గు చూపే ఆస్కారముంది.
మా ఏజెన్సీకి సంబంధం లేదు
హెచ్‌పీ గ్యాస్ పేరుతో ఇంటింటా స్టిక్కర్లు అతికిస్తున్న యువకులకు మా ఏజెన్సీకి ఎలాంటి సంబంధమూ లేదు. రేకులమీద గ్యాస్ నంబర్లు అతికి స్తున్నదెవరో మాకు తెలీదు. ప్రజలతో డబ్బు వసూలు చేస్తున్నార న్న విషయం మా దష్టికి రాలేదు. మేము కూడా ఎవరికీ డబ్బువసూలు చేయాలని చెప్పలేదు. - శ్రీలక్ష్మి హెచ్‌పీ గ్యాస్ ఎంటర్‌ప్రై జెస్, ధర్మవరం
నంబర్ వన్ దోపిడీ
Published Sat, May 14 2016 11:21 AM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM
Advertisement
Advertisement