ఆ అధికారి సొమ్ముతోనే వ్యాపారం
ఒక చీటర్‌తో సంబంధాలు
భయపడుతున్న బాధితులు
విజయవాడ : కాల్‌మనీ వ్యాపారం చేస్తున్న ఉపాధ్యాయుడికి ఓ పోలీస్ అధికారి అండ పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. విజయవాడలోని మురళీనగర్‌లో ఉంటూ తోట్లవలూరు మండలం భద్రిరాజుపాలెంలోని జెడ్పీ స్కూల్‌లో ఉపాధ్యాయుడుగా చేస్తున్నారు. గతంలో పటమటలో ఉన్న ఉపాధ్యాయుడు, ఆయన భార్య మహిళలకు మాత్రమే రుణాలు ఇస్తారని, నూటికి రూ.20 వడ్డీ వసూలు చేసేవారని తెలిసింది. ఈ ఉపాధ్యాయుడు వెనుక ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పోలీసు అధికారివ్యక్తి హస్తం ఉన్నట్లు తెలిసింది. ఆయన డబ్బునే ఇక్కడ ఉపాధ్యాయుడు కాల్‌మనీకి తిప్పుతున్నారని బాధితులు చెబుతున్నారు.
గతంలో ఒక చీటర్‌తో సంబంధాలు.....
తెనాలి వెళ్లే మార్గ మధ్యంలో తన కారు కాలువలో పడిపోయినట్లు నటించిన చీటర్ నార్ల వంశీతో ఈ ఉపాధ్యాయుడు, పోలీసు అధికారికి సంబంధాలు ఉన్నట్లు సమాచారం. వంశీ వద్ద పోలీసు అధికారి రూ.కోట్లు గుంజి ఉపాధ్యాయుడికి ఇచ్చారని వారి గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ఆ డబ్బునే కాల్‌మనీగా తిప్పుతున్నారు. కాల్‌మనీ ముఠాకు అధికార పార్టీ నాయకుల అండదండలుండటంతో తన సొమ్మును కూడా ఈ ముఠాకు ఇచ్చి వారితో చక్కటి సంబంధాలు నడుపుతూ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. సిండికేట్‌గా ఉండటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా ధైర్యం చేయడం లేదు.
ఇంటెలిజెన్స్ విభాగం విచారణతో సరి..
ఉపాధ్యాయుడు గురించి ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేశారే తప్ప కేసును ముందుకు తీసుకువెళ్లలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసు, న్యాయశాఖకు చెందిన ప్రముఖులతో ఉపాధ్యాయుడుకు సంబంధాలు ఉండటమే అందుకు కారణమని అంటున్నారు. పోలీసు కమిషనర్ ఇటువంటి కేసులపై దృష్టి పెట్టాలని బాధితులు కోరుతున్నారు.
కాల్‌మనీ ఉపాధ్యాయుడికి పోలీసు అండ..?
Published Fri, Dec 25 2015 12:25 AM | Last Updated on Wed, Aug 15 2018 7:18 PM
Advertisement
Advertisement