సాక్షి, హైదరాబాద్: దేశంలో మొత్తం రాజకీయ పార్టీల సంఖ్య 18 వందల పైచిలుకే. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం దేశంలో 1,807 రాజకీయ పార్టీలున్నాయి. ఇందులో ఆరు పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. 64 రాష్ట్రస్థాయి పార్టీలుగా గుర్తింపు కలిగాయి.
రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన కొన్ని పార్టీలు రెండు, మూడు రాష్ట్రాల్లోనూ గుర్తింపు పొందాయి. జాతీయ, రాష్ట్ర పార్టీలను పక్కన పెడితే రాజకీయ పార్టీలుగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదై దేశవ్యాప్తంగా గుర్తింపు లభించని పార్టీల సంఖ్య 1,737. ఏపీలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌తోపాటు టీఆర్‌ఎస్‌కు రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీగా గుర్తింపు లభించింది. తెలంగాణలో టీఆర్‌ఎస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌లతోపాటు ఎంఐఎంకు రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు లభించింది.
దేశంలో పార్టీలు 1,800 పైచిలుకే..!
Published Thu, Jan 15 2015 1:57 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement