రైలు ప్రమాద మృతులలో దాదాపు ఎనిమిది మంది ఒడిషా వాసులేనని తెలుస్తోంది. వీళ్లలో చాలామంది రిజర్వేషన్ బోగీలలో వారే కావడంతో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళల పేర్లను గుర్తించినట్లు సమాచారం. రిజర్వేషన్ బోగీలో ఉన్న చార్టులను బట్టి వాళ్ల ఫోన్ నంబర్ల ఆధారంగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, రైలు ప్రయాణిస్తుండగా కొంతమంది రిజర్వేషన్ లేకుండానే రిజర్వుడు బోగీలలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అలాంటివాళ్లు ఎవరైనా మరణిస్తే మాత్రం వివరాలు తెలిసే అవకాశం లేదని భావిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో కూడా కొన్ని సీటు నంబర్ల ఆధారంగా చూసినప్పుడు, ఆయా సీట్లలో పురుషులకు బదులు మహిళలు ప్రయాణించినట్లు తెలిసింది.
దీనివల్ల మృతుల గుర్తింపు కష్టం అవుతోంది. రైల్వే అధికారులు, విజయనగరం జిల్లా యంత్రాంగంతో పాటు పోలీసులు, ఇతర అన్ని శాఖల ఉద్యోగులు, స్థానికులు కూడా ప్రమాద సంఘటన స్థలం వద్దకు చేరుకుని సహాయ కార్యకలాపాలలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. అయితే ప్రస్తుతం ఎక్కడపడితే అక్కడ పట్టాల వెంబడి మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. రైలు కదిలితే మరింతమంది చక్రాల కింద పడిపోయి మరణించే ప్రమాదం ఉంది. పట్టాల మీద అడ్డంగా ఉన్న మృతదేహాలను తరలించడం, అలాగే, చక్రాల కింద లేదా రైలు కింద ఎవరైనా ఉంటే వారిని అక్కడినుంచి తీయడం లాంటి చర్యలకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
మృతులలో అత్యధికులు ఒడిషా వాసులే?
Published Sat, Nov 2 2013 9:58 PM | Last Updated on Sat, Sep 2 2017 12:14 AM
Advertisement