ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
Published Wed, Nov 25 2015 12:55 PM | Last Updated on Fri, Jun 1 2018 8:54 PM
నార్పల: అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లెలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు పాలలో విషం కలిపి ఇచ్చి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లీ కొడుకూ మరణించగా కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. నార్పల మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన మాధవి(24)కి ముదిగుబ్బ మండలం కొడవళ్లపల్లె గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కొన్ని నెలల క్రితం భర్త ఓ హత్యకేసులో ఇరుక్కుని జిల్లా సబ్‌జైలులో ఉన్నాడు. అప్పటి నుంచి మాధవి తన పుట్టింటి వద్దే ఉంటోంది.
భర్త ఎంతకీ జైలు నుంచి విడుదల కావడం లేదనే మనస్తాపంతో మాధవి, తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఉరేసుకుంది. ఈ సంఘటనలో కుమారుడు లోకేశ్వర్ రెడ్డి(3), మాధవి మృతిచెందగా, కూతురు భాను(5)ను మెరుగైన చికిత్స నిమిత్తం పాపను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement