
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రవేశపెట్టారు. ఆయన ప్రతిపాదనను విప్ కూన రవికుమార్, జయ నాగేశ్వరరెడ్డి బలపరిచారు. కాగా ఈరోజు ఉదయం 11 గంటలకు ఉప సభాపతి ఎన్నిక జరగనుంది. మరోవైపు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్లు ప్రవేశపెట్టనున్నారు.