ఎంఐఎంతో కలిసి ఉద్యమం:కెటిఆర్ హెచ్చరిక | Movement with MIM: KTR Warning | Sakshi
Sakshi News home page

ఎంఐఎంతో కలిసి ఉద్యమం:కెటిఆర్ హెచ్చరిక

Published Wed, Sep 4 2013 8:22 PM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM

Movement with MIM: KTR Warning

ఢిల్లీ: హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేసే ప్రతిపాదనను కేంద్రం తెస్తే ఎంఐఎంతో కలిసి ఉద్యమం చేస్తామని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ హెచ్చరించారు. కేంద్రపాలిత ప్రాంతం ప్రతిపాదనను తాము ఒప్పుకోం అని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం కాంగ్రెస్ పెద్దలందర్నీ కలుస్తాన్నారు.

కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తే సంబరం, లేదంటే సమరమేనని హెచ్చరించారు. తెలంగాణపై టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌ భవన్‌కు త్వరలోనే టులెట్ బోర్డు పెట్టుకోవాలన్నారు. ఏపీఎన్జీవోల సభ అనుమతిపై డీజీపీ రాజకీయాలు చేస్తున్నారని  కేటీఆర్ ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement