ఎంపీటీసీ స్థానాలు 706 | MPTC 706 locations | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీ స్థానాలు 706

Published Thu, Aug 15 2013 4:03 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

MPTC 706 locations

జిల్లాపరిషత్, న్యూస్‌లైన్ : జిల్లాలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని పంచాయతీ రాజ్ కమిషనర్ రాంగోపాల్ ఈ నెల మొదటి వారంలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా యంత్రాగం కసరత్తు పూర్తి చేసింది.

గతంలో 2006 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 760 ఎంపీటీసీ స్థానాలుండేవి. కొన్ని గ్రామపంచాయతీలు ఇటీవల మునిసిపాలిటీల్లో విలీనమైన నేపథ్యంలో 80 ఎంపీటీసీ స్థానాలు గల్లంతు కాగా...  680కి పరిమితమయ్యాయి. అయితే 2011 జనాభాను పరిగణనలోకి తీసుకుని చేపట్టిన పునర్విభజనలో మరో 26 స్థానాలు పెరిగాయి. జిల్లావ్యాప్తంగా 50 మండలాల్లో 706 ఎంపీటీసీ స్థానాలు ఖరారయ్యాయి. ఎంపీటీసీ స్థానాల తాజా ముసారుుదా జాబితాను బుధవారం కలెక్టర్ జి.కిషన్ ప్రకటించారు.

జిల్లవ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాల జాబితాను జిల్లా పరిషత్ కార్యాలయంలో, మండలాలవారీగా మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఎంపీటీసీల స్థానాలపై అభ్యంతరాలు ఉంటే  ఈనెల 21వ తేదీ వరకు ఆయూ ఎంపీడీఓ కార్యాలయూల్లో దరఖాస్తు రూపంలో తెలపాలని కలెక్టర్ సూచించారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు అభ్యంతరాల పరిశీలన ఉంటుందని, 27న తుదిజాబితా ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

 తగ్గిన స్థానాలు ఇవే...
 మునిసిపాలిటీల్లో ఆయూ గ్రామాలు విలీనం కావడంతో హన్మకొండలో 22, హసన్‌పర్తిలో 13, గీసుకొండలో 7, మహబూబాబాద్‌లో 11, నర్సంపేటలో 9, పరకాలలో 6, భూపాలపల్లిలో 8, ధర్మసాగర్‌లో 2, సంగెం, వర్ధన్నపేటలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 80 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి.

 తాజా ఎంపీటీసీ స్థానాలు మండలాలవారీగా...
 హన్మకొండ మండలంలో 2, హసన్‌పర్తిలో 8, ఆత్మకూరులో 17, గీసుకొండలో 9, సంగెంలో 13, స్టేషన్‌ఘన్‌పూర్ 26, ధర్మసాగర్‌లో 19, జఫర్‌గఢ్‌లో 13, వర్ధన్నపేటలో 21, రాయపర్తిలో 16, పర్వతగిరిలో 14, జనగామలో 11, రఘునాథపల్లిలో 15, లింగాలఘనపురంలో 11, చేర్యాలలో 20, మద్దూరులో 11, బచ్చన్నపేటలో 13, నర్మెటలో 12, కొడకండ్లలో 15, దేవరుప్పులలో 12, పాలకుర్తిలో 17, మహబూబాబాద్‌లో 17, కేసముద్రంలో 19, డోర్నకల్‌లో 16, కురవిలో 19, మరిపెడలో 24, నెల్లికుదురులో 17, నర్సింహులపేటలో 17, తొర్రూర్‌లో 22, నెక్కొండలో 14, నర్సంపేటలో 9, చెన్నారావుపేటలో 15, దుగ్గొండిలో 12, గూడూరులో 16, కొత్తగూడలో 11, ఖానాపురంలో 9, నల్లబెల్లిలో 11, ములుగులో 18, ములుగు గణపురంలో 9, గోవిందరావుపేటలో 9, వెంకటాపూర్‌లో 11, ఏటూర్‌నాగారంలో 12, మంగపేటలో 14, తాడ్వాయిలో 7, పరకాలలో 15, శాయంపేటలో 12, రేగొండలో 17, చిట్యాలలో 18, మొగుళ్లపల్లిలో 11, భూపాలపల్లిలో 8 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. కాగా.. హన్మకొండలో కేవలం రెండు ఎంపీటీసీ స్థానాలే ఉండగా... ఈ మండలాన్ని హసన్‌పర్తిలో విలీనం చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ మేరకు హన్మకొండ మండలాన్ని రద్దు చేస్తే జిల్లాలో మండలాలు 49కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement