బహుముఖ ప్రజ్ఞాశాలి అబ్బూరి మృతి | multi talented abburi gopalakrishna is no more | Sakshi
Sakshi News home page

బహుముఖ ప్రజ్ఞాశాలి అబ్బూరి మృతి

Published Wed, Feb 1 2017 4:32 AM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి అబ్బూరి మృతి

బహుముఖ ప్రజ్ఞాశాలి అబ్బూరి మృతి

విశాఖలోని స్వగృహంలో కన్నుమూత
విశాఖ–కల్చరల్‌: నటన, రచన, రంగస్థల దర్శకత్వం, చిత్రలేఖనం, సాహిత్యం, సంగీతం వంటి విభిన్న రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరో హించిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్‌ అబ్బూరి గోపాల కృష్ణ (81)విశాఖలోని తన స్వగృహంలో మంగళవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. అబ్బూరి మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.

విశాఖలో పుట్టిన ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నాటక విభాగం అధిపతిగా పని చేసి పదవీ విరమణ పొందారు. అబ్బూరి నాటక రచయితే కాకుండా గొప్ప చిత్రకారుడు కూడా కావడం వల్ల రంగస్థలంపై దృశ్యాన్ని రమణీయంగా చిత్రిం చేవారు. అబ్బూరి రచనలు అద్భుతాలు అని మహాకవి శ్రీశ్రీ కితాబునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement