కూరగాయల మార్కెట్ కూల్చివేతపై మంగళవారం వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిల ర్లు మున్సిపల్ కమిషనర్ ఎన్.నూకేశ్వరరావు చాంబర్‌కు వెళ్లి నిలదీశారు. ప్రశ్నాస్త్రాలతో ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. కౌన్సిలర్లు సంధించిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి. ఈ నెల 11, 16, 20 తేదీల్లో మిమ్మల్ని కలిసి కూరగాయల మర్కెట్ పునర్నిర్మాణంపై చర్చకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరాం. దీనికి స్పందించకుండా ఏ అధికారంతో రాత్రిపూట షాపులను కూలదోశారు.
అభివృద్ధికి మేం అడ్డుకాదు. షాపింగ్ కాం ప్లెక్స్ నిర్మిస్తే ఆదాయం పెరుగుతుందని తెలుసు. అలాగని 80 ఏళ్లుగా ఆ మార్కెట్‌నే నమ్ముకొని జీవిస్తున్న 42 మంది కూరగాయ ల వర్తకులకు ప్రత్యామ్నాయం చూపకుండా షాపులు కూలగొట్టడం న్యాయమేనా..
ఈ నెల 30న కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమావేశపు ఎజెండాలోనూ మార్కెట్ అంశాన్ని ఎందుకు చేర్చలేదు.. సమావేశానికి నాలుగు రోజుల ముందే హడావుడిగా కూలగొట్టాల్సిన అవసరమేముంది. ఈ వివాదంపై చర్చకు కౌన్సిల్ సమావేశం ఎందుకు పెట్టలేదో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలి.
వీటికి కమిషనర్ స్పందిస్తూ..
సమావేశం ఏర్పాటు చేసే అధికారం నాకు లేదు. దీనిపై చైర్‌పర్సన్ తమ్మినేని గీతకు ఫైల్ పెట్టాను. మీరు లేవనెత్తిన ప్రశ్నలను రాతపూర్వకంగా ఇస్తే.. నేను కూడా రాతపూర్వకంగా సమాధానం ఇస్తాను.. అని చెప్పారు. దాంతో కౌన్సిలర్లు ఒక డిమాండ్ల పత్రం రూపొందించి కమిషనర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ వైస్ ఫ్లోర్‌లీడర్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, కౌన్సిలర్లు బొడ్డేపల్లి అజంతాకుమారి, బొడ్డేపల్లి ఏకాసమ్మ, పొన్నాడ కృష్ణవేణి, గురుగుబెల్లి వెంకటప్పలనాయుడు, దుంపల శ్యామలరావు, దుంపల చిరంజీవులు, మరాఠి వెంకటేష్, సంపదరావు మురళీధరరావు లతోపాటు మాజీ కౌన్సిలర్లు జె.వెంకటేశ్వరరావు, జె.నాగభూషణరావు, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్‌పై ప్రశ్నల దాడి
Published Wed, Aug 27 2014 3:46 AM | Last Updated on Tue, May 29 2018 4:15 PM
Advertisement
Advertisement