'మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు'
విశాఖపట్నం: రాష్ట్రంలో కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇటీవల ఎన్నికలు జరిగాయని... మిగిలిన మున్సిపాలిటిలు, కార్పొరేషన్లకు మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. మంగళవారం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో రోడ్డు భద్రత వారోత్సవాలను ఆయన ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని కోసం టీడీపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటుపై ఆరోపణు చేయడం సరైనది కాదని గంటా శ్రీనివాసరావు ఈ సందర్బంగా అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రాజధాని కోసం టీడీపీ ప్రభుత్వం మున్సిపల్ మంత్రి నారాయణ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల నేపథ్యంలో పార్టీకి విరాళాలు ఇచ్చిన వారికే ఆ కమిటీలో చోటు కల్పించారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.