తిరువూరు : కృష్ణా జిల్లా మునిసిపల్ కమిషనర్ల సమీక్ష సమావేశంలో పాల్గొనేందుకు మంగళవారం తిరువూరు వచ్చిన రాజమండ్రి ప్రాంతీ య సంచాలకుడు (ఆర్డీ) రాజేంద్రప్రసాద్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మాటువేసి పట్టుకోవడం కలకలం సృష్టించింది. తనను లంచం కోసం ఆర్డీ వేధిస్తున్నారని పెడన మునిసిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మత్తి వినోద్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ ఉదయం నుంచి తిరువూరు నగర పంచాయతీ కార్యాల యం ఎదుట మాటువేశారు.
ఆర్ అండ్ బీ అతిథి గృహంలోని ఓ గదిలో తన క్యాంప్ క్లర్కు నాగరాజు ద్వారా ఆర్డీ సొమ్ము తీసుకుంటుం డగా ఏసీబీ అధికారులు రంగప్రవేశం చేశారు. రాజేంద్రప్రసాద్, నాగరాజు కొద్దిసేపు ప్రతిఘటించారు. తమదైన శైలిలో ప్రశ్నించి ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ ఇద్దరి నుంచి నిజాలు రాబట్టారు. గంటసేపు నిందితులను విచారించిన అనంతరం వారి వద్ద ఉన్న నగదును రసాయన పరీక్షలు చేసి అది లంచం సొమ్మేనని నిర్ధారించారు. అనంతరం మధ్యవర్తుల సమక్షంలో పంచనామా చేశారు. మరికొద్ది సమయం వేచివుంటే రాజేంద్రప్రసాద్‌కు లంచం ఇచ్చేం దుకు కొందరు అధికారులు సైతం క్యూ కట్టేవారని ఏసీబీ అధికారులు భావించగా, ఆర్డీ అనుచరులు కొందరు చేసిన హంగామాతో పలువురు జారుకున్నారు.
ఉదయం అభినందన...సాయంత్రం అభిశంసన
సమీక్ష సమావేశానికి వచ్చిన రాజేంద్రప్రసాద్ అభినందనలు పొందిన కొద్దిసేపటికే ఏసీబీ దాడిలో చిక్కారు. రాజేంద్రప్రసాద్‌ను ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు నగర పంచాయతీ కార్యాల యంలో ఉదయం శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. అనంతరం ఒంటిగంట వరకు సమీక్ష జరిపిన ఆర్డీ ఆర్ అండ్ బీ అతిథి గృహానికి భోజనం కోసం వెళ్లి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
ఏసీబీ వలలో మునిసిపల్ ఆర్డీ
Published Wed, May 13 2015 2:27 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement