ఏలూరు: కౌలు డబ్బు అడగటానికి వచ్చిన ఇద్దరు మహిళలపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి ఓ మహిళను హత్య చేశాడు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం దొడ్డనపూడి శివారు ఉత్తరగూడెంలో ఉండే నాగరాజు వద్దకు అతని వదిన లక్ష్మీఝాన్సీ, ఆమె తల్లి నాగమణి వెళ్లారు.
కౌలు డబ్బులు ఇవ్వడంలేదేమిటని నాగరాజును ప్రశ్నించి, డబ్బు ఇవ్వమని అడిగారు. దాంతో నాగరాజు కత్తి తీసుకుని వారిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నాగమణి మృతి చెందింది. లక్ష్మీఝాన్సీకి తీవ్ర గాయాలయ్యాయి.
కౌలు డబ్బు అడిగితే హత్య!
Published Sat, May 16 2015 5:35 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement