
సమన్యాయమంటూ ఎందుకు తిరుగుతున్నారు?
హైదరాబాద్: సమన్యాయం అంటున్న చంద్రబాబు నాయుడు కోల్కతా, ముంబై ఎందుకు తిరుగుతున్నారని బీజేపీ నాయకుడు నాగం జనార్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ టీడీపీ నేతలకు సిగ్గుంటే వెంటనే పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో రెండు ప్రాంతాల్లోనూ టీడీపీ గల్లంతవుతుందని జోస్యం చెప్పారు.
తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాసవుతుందని తమ పార్టీ జాతీయ నాయకులు తమతో చెప్పారని తెలిపారు. తెలంగాణ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆలస్యం కావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని నాగం జనార్ధన్‌రెడ్డి ఆరోపించారు.