‘అవినీతి రహిత పాలన అందించండి’ | Narayanaswami Comments On Grama Sachivalayam Jobs In Chittoor | Sakshi
Sakshi News home page

‘అవినీతి రహిత పాలన అందించండి’

Published Tue, Oct 1 2019 10:36 AM | Last Updated on Tue, Oct 1 2019 10:36 AM

Narayanaswami Comments On Grama Sachivalayam Jobs In Chittoor - Sakshi

సచివాలయ ఉద్యోగాల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలు

సాక్షి, యూనివర్సిటీ(చిత్తూరు) : ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీచేసి రికార్డు సృష్టించారని ఏపీ ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. తిరుపతి శ్రీనివాస ఆడిటోరియంలో సోమవారం గ్రామ, వార్డు సచివాల య ఉద్యోగులుగా ఎంపికైన వారికి నియామకపత్రాలు అందజేశారు. సుమారు 1500 మంది ఈ కార్యక్రమంలో నియామక ప్రతాలు అందుకున్నారు.  ఈ సం దర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ ఏపీ సీఎం తన పాదయాత్రలో, ఎన్నికల మేని ఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి పాలనను ప్రజల వద్దకే తీసుకొచ్చారన్నారు.

నాలుగు నెలల్లో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. నెల రోజుల వ్యవధిలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.26 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించారన్నారు. 20 లక్షల మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేస్తే, ఎలాంటి అక్రమాలు, అవకతవకలు లేకుం డా పూర్తి పారదర్శకతతో ఉద్యోగాలను భర్తీ చేశారన్నారు. ఈ ఉద్యోగాలు పొందిన వారు ఎలాంటి అవినీతికి తావు లేకుండా పనిచేయాలన్నారు. అలా పనిచేసినపుడే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  లక్ష్యం నెరవేరుతుందన్నారు. కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి అధ్యక్షత వహించారు. 

యూనివర్సిటీ క్యాంపస్‌: గ్రామ, వార్డు సచి వాలయాల ఉద్యోగులు అవినీతి రహిత పాలనకు నాంది పలకాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖమంత్రి కళత్తూరు నారాయణ స్వామి పిలుపునిచ్చారు. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో సోమవారం గ్రామ, వార్డు సచివాల య ఉద్యోగాలు పొందిన వారికి  నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో నారాయణస్వామి మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో భాగంగా నిరుద్యోగ యువతకు అండగా నిలి చేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారన్నారు. అందులో భాగంగానే ఈ ఉద్యోగ నియామక ప్రక్రియకు చర్యలు తీసుకున్నారన్నారు. జాతిపిత కలలు కన్న గ్రా మ స్వరాజ్యాన్ని తీసుకొచ్చే దిశగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పని చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం భారతదేశంలో మహోన్నత ఘట్టం అన్నారు. 

1500 మందికి నియామక పత్రాల పంపిణీ
సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల్లో జిల్లాలో 8,231 మంది అర్హత సాధించారు. వీరిలో 5,563 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వీరిలో ఇప్పటివరకు 3.673 మందికి ఉద్యోగాలకు ఎంపిక చేశారు. శ్రీని వాస అడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో 1,500 మందికి నియామక పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ గిరిషా, జేసీ 2 చంద్రమౌళి, అగ్రికల్చర్‌ జేడీ విజయ్‌కుమార్, సిరికల్చర్‌ జేడీ అరుణకుమారి, తిరుపతి అడిషనల్‌ కమిషనర్‌ హరిత, జెడ్పీ సీఈఓ కోదండ రామి రెడ్డి, చిత్తూరు మున్సిపల్‌ కమిషనర్‌ ఓబులేశు, ఎస్‌ఈపీ ఆర్‌ అమరనాథ రెడ్డి పాల్గొన్నారు.

యువతకు అండ  
రాష్ట్ర ప్రభుత్వం యువతకు అండగా నిలుస్తోందని తి రుపతి ఎంపీ బల్లి దుర్గా ప్ర సాద్‌ అన్నారు. ఉద్యోగాల విప్లవాన్ని తీసుకుని వచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికే చెందుతుందని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో పని చేసే ఉద్యోగులు ముఖ్యమంత్రి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.  

అరుదైన అవకాశం 
సమాజానికి సేవ చేసే అరుదైన అవకాశం గ్రామ, వా ర్డు సచివాలయ ఉద్యోగులకు లభించిందని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప అన్నారు. దేశ చరిత్రలో సచివాలయ ఉ ద్యోగాల నియామకం మరపురాని ఘట్టమన్నా రు. గతంలో రెడ్డి, కరణం వ్యవస్థ గ్రామ స్థాయిలో బలంగా ఉండేదన్నారు.

దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలలలోపే 1.50 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడం భారత దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కేంద్రీకృత పరిపాలనకు స్వస్తి పలికి, వికేంద్రీకరణ పరిపాలనకు నాంది పలికారన్నారు. 

సమస్యలు పరిష్కరించే దిశగా విధులు
ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పని చేయాలని ఎంఎల్‌సీ యండవల్లి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఈ పరీక్షల నిర్వహణ అద్భుతంగా నిర్వహించారని, పూర్తి పారదర్శకతతో నియామకాలు చేపట్టారన్నారు. ఈ నూతన ప్రక్రియకు నాంది పలికిన రాష్ట్ర ముఖ్యమంత్రిని అభినందించారు.  

వంద రోజుల్లోనే సుపరిపాలనకు నాంది     
వంద రోజుల్లోనే రాష్ట్రంలో సుపరిపాలనకు నాంది పలికిన ఘనత ముఖ్య మంత్రి  జగన్‌ మోహన్‌రెడ్డికే దక్కుతుందని మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌ బాషా అన్నారు.

మంచి పేరు తీసుకురండి 
అంకిత భావం, బాధ్యతతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురా వాలని కలెక్టర్‌  నారాయణ భరత్‌ గుప్త పిలుపునిచ్చారు. నియామక ప్రక్రియలో కూడా ఎటువంటి పొరపాట్లు లేకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకుని, నియామకపు ఉత్తర్వులు అందిస్తున్నామన్నారు. మెరిట్‌ జాబితా లో ఉండి నియామక ఉత్తర్వులు పొందని వారు ఈనెల 1, 2 తేదీల్లో సంబంధిత హెచ్‌ఓడీలను సంప్రదించాలన్నారు. 

పల్లె సంక్షేమంతోనే రాష్ట్రం సుభిక్షం
ఒక మహిళ, ఒక కుటుం బం, ఒక గ్రామం సుభిక్షంగా ఉన్నట్లైతే జిల్లా, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి అన్నారు. నమ్మిన సిద్ధాంతాన్ని అమలు చేసిన మహోన్నత వ్యక్తి మన ముఖ్యమంత్రి అన్నారు. 

నిబద్ధతతో పని చేయాలి
అవినీతి రహిత పాలనకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిబద్ధతతో ప ని చేయాలని  పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. యువ ముఖ్యమంత్రి ఆశయం మేరకు 3 నెలల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ నియమకాలు చేపట్టడం మహాద్భుతమైన ఘట్టమన్నారు.  

చిత్తశుద్ధితో పని చేయండి
సచివాలయ ఉద్యోగాలు పొందిన  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నవరత్నాలు పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా చిత్తశుద్ధితో పని చేయాలని చిత్తూరు ఎమ్మెల్యే ఏ.శ్రీనివాసులు అన్నారు. సీఎం ఆశయాలను వమ్ము చేయవద్దన్నారు.

ప్రతి 2 వేల మందికి ఒక సచివాలయం
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతి 2 వేల మంది జనా భాకు ఒక గ్రామ, వార్డు సచివాలయం ఏర్పాటు చే సి, ఉద్యోగాల నియామకం చేపట్టారని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం అన్నారు.  ఈ మహోన్నత ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై విజయవంతం చేయాలని కోరారు.

యువతకు భారీగా ఉద్యోగాలు  
దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా రూ.3 లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ  యు వతకు భరోసానిస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్న ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అన్నారు. 

ప్రజా సంక్షేమానికి పెద్దపీట
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్ద పీఠం వేస్తుందని పూతలపట్టు ఎమ్మెల్యే ఎం. ఎస్‌.బాబు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార నిమి త్తం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకం చేపట్టిందన్నారు.

ఇది అద్భుతమైన క్షణం
మాది మదనపల్లెలోని పప్పిరెడ్డిపల్లె. మా తల్లి దండ్రులు ఈశ్వరప్ప, చంద్రమ్మ పాల వ్యాపారం చేసుకుని జీవిస్తున్నారు. నేను బీటెక్‌ బయో టెక్నాలజీ పూర్తి చేశాను. గ్రామ సచి వాలయ ఉద్యోగ రాతపరీక్షల్లో క్యాట గిరి–1లో 93.75 మార్కులతో రాష్ట్రస్థాయిలో 41వ ర్యాంకు పొంది, ఉద్యోగం సాధించాను.    
 –మంజుల

చిత్తశుద్ధితో పనిచేస్తాను
మాది గుర్రంకొండ మం డలం సంఘసముద్రం గ్రామం. మా తండ్రి మహబూబ్‌బాషా రైతు. ఎంఎస్సీ, ఎంసీఏ చదివినప్పటికీ ఇప్పటి వరకు ఉద్యోగం లేదు. సచివాలయ ఉద్యోగాల్లో డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీగా రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంక్‌ పొందాను. ఈ నియామకాలు పూర్తి పారదర్శకంగా నిర్వహించడం వల్ల నాకు ఉద్యోగం వచ్చింది.  
 –ఖాదర్‌ వల్లీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement