సాక్షి, విజయవాడ : ఏపీఎస్ ఆర్టీసీలో మళ్లీ సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యానికి నేషనల్ మజ్దూర్ యూనియన్ సమ్మె నోటీసులు ఇచ్చింది. నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు 46 డిమాండ్లతో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకు బుధవారం సమ్మె నోటీసులు ఇచ్చారు. కార్మికుల వేతన సవరణ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సిబ్బంది కుదింపు, గ్రాడ్యుటీ తగ్గింపు, అద్దె బస్సుల పెంపు నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఆర్టీసీకి చెల్లించాల్సిన 670కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 22 తర్వాత సమ్మెకు దిగుతామని ఎన్ఎంయూ నేతలు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment