పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం | Naveen Nischal Criticize On CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం

Published Sun, Apr 29 2018 7:46 AM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

Naveen Nischal Criticize On CM Chandrababu Naidu - Sakshi

 సమావేశంలో మాట్లాడుతున్న సమన్వయకర్త నవీన్‌ నిశ్చల్‌

చిలమత్తూరు : వైఎస్సార్‌సీపీ బలోపేతానికి సమష్టిగా కృషి చేద్దామని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌ నిశ్చల్‌ వైఎస్సార్‌సీపీశ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని కన్యక పరమేశ్వరీ ఆలయ ఫంక్షన్‌ హాల్‌లో మండల కన్వీనర్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్‌ సీపీ బూత్‌ కమిటీల అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త నవీన్‌ నిశ్చల్‌ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

టీడీపీ అవినీతి, అక్రమాలతోపాటు చంద్రబాబు బూటకపు హామీలపై ప్రజలకు బూత్‌ లెవల్‌ కమిటీలు అవగహన కల్పించాలన్నారు. అదేవిధంగా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన  పాదయాత్రతోపాటు నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని సీఎం చేయాలని, ఎమ్మెల్యేగా నన్ను ఆశ్వీరిందించాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. కన్వీనర్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి అన్నాసుందర్‌ రాజ్, సమావేశపు పరిశీలకులు ఆకుల రాజశేఖర్‌ మాట్లాడుతూ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలన్నారు.

అందు కోసం చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేయలన్నారు. సమావేశంలో పార్లమెంటరీ కార్యదర్శి మోదిపి లక్ష్మీనారాయణ, సర్పంచ్‌లు శంకర్‌రెడ్డి, సూరి, ఎంపీటీసీలు లక్ష్మీరెడ్డి, నాగభూషణాచారి, రామిరెడ్డి, రామచంద్రప్ప, శివశంకర్‌రెడ్డి, రఫీక్, శేసాద్రిరెడ్డి, జయచంద్రారెడ్డి, ఫరూక్, కంబాలపల్లి రంగారెడ్డి, నయిముల్లా, ప్రభాకర్‌రెడ్డి, సిద్దిక్, రమేష్, గంగాధర్, తిప్పన్న, యుగంధర్, నస్రూ, సురేంద్రరెడ్డి, కిశోర్, శంకర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement