criticizes CM Chandrababu
-
రాష్ట్రం నీ బాబు సొత్తు కాదు
కంకిపాడు/ఉయ్యూరు : చంద్రబాబూ...ఖబడ్దార్. రాష్ట్రం నీ బాబు సొత్తు కాదు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ మచిలీపట్నం పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఉయ్యూరులోని మార్కెట్ సెంటరులో శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర బహిరంగ సభలో పార్థసారథి ప్రసంగించారు. పేదవాడికి రేషన్‌కార్డు, పక్కా ఇల్లు, ఇంటి స్థలం, పింఛను ఏ ఒక్కటి ఇవ్వాలన్నా వాళ్ల బాబు సొమ్ము పోతున్నట్లు టీడీపీ ప్రభుత్వం బాధపడుతుందని మండిపడ్డారు. టీడీపీ తన పాలనలో ఉయ్యూరులో ఏ ఒక్కరికీ సెంటు భూమి ఇచ్చి, ఇల్లు కట్టించలేదన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కోట్లాది రూపాయలు వెచ్చించి భూములు సేకరించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై ఆగ్రహం.... పార్థసారథి మాట్లాడుతూ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘జనాల కోసం డ్యాన్సులు వేయటం మాకు చేతకాదు.. ఉయ్యూరు సెంటరులో జనంతో చప్పుట్లు కొట్టించుకునేందుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు డ్యాన్స్‌లు వేశారు... ప్రజలు కడుపుకాలి ఆకలితో బాధపడుతుంటే డ్యాన్సులు ఎవరైనా వేస్తారా?... ప్రజలు కష్టాలు తెలుసుకుని ఆకలి తీర్చేందుకు వైఎస్ కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చారు కాబట్టే వేలాదిగా జనం తరలివచ్చారన్నారు. ఈశ్వరయ్య లేఖపై నోరెత్తలేని దద్దమ్మ... జస్టిస్ ఈశ్వరయ్య బీసీలకు న్యాయమూర్తుల ఎంపికపై జరుగుతున్న అన్యాయంపై బహిరంగంగా లేఖ రాస్తే సమాధానం చెప్పలేని దద్దమ్మ చంద్రబాబు కాదా? అన్నారు. కేంద్రం ఈశ్వరయ్య వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు తేలితే చంద్రబాబును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు ఒక్క రూపాయి కూడా పేదల నుంచి తీసుకోకుండా రూ.3 లక్షలతో ఇళ్లు కట్టించేందుకు చర్యలు తీసుకోవాలని, కాల్వ కట్ల వాసులకు పూర్తి భరోసా ఇవ్వాలని జగన్‌కు విజ్ఞప్తిచేశారు. -
పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం
చిలమత్తూరు : వైఎస్సార్సీపీ బలోపేతానికి సమష్టిగా కృషి చేద్దామని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ వైఎస్సార్‌సీపీశ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని కన్యక పరమేశ్వరీ ఆలయ ఫంక్షన్ హాల్లో మండల కన్వీనర్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్ సీపీ బూత్ కమిటీల అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త నవీన్ నిశ్చల్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ అవినీతి, అక్రమాలతోపాటు చంద్రబాబు బూటకపు హామీలపై ప్రజలకు బూత్ లెవల్ కమిటీలు అవగహన కల్పించాలన్నారు. అదేవిధంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్రతోపాటు నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని, ఎమ్మెల్యేగా నన్ను ఆశ్వీరిందించాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. కన్వీనర్ జగన్మోహన్ రెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి అన్నాసుందర్ రాజ్, సమావేశపు పరిశీలకులు ఆకుల రాజశేఖర్ మాట్లాడుతూ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలన్నారు. అందు కోసం చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేయలన్నారు. సమావేశంలో పార్లమెంటరీ కార్యదర్శి మోదిపి లక్ష్మీనారాయణ, సర్పంచ్‌లు శంకర్‌రెడ్డి, సూరి, ఎంపీటీసీలు లక్ష్మీరెడ్డి, నాగభూషణాచారి, రామిరెడ్డి, రామచంద్రప్ప, శివశంకర్‌రెడ్డి, రఫీక్, శేసాద్రిరెడ్డి, జయచంద్రారెడ్డి, ఫరూక్, కంబాలపల్లి రంగారెడ్డి, నయిముల్లా, ప్రభాకర్‌రెడ్డి, సిద్దిక్, రమేష్, గంగాధర్, తిప్పన్న, యుగంధర్, నస్రూ, సురేంద్రరెడ్డి, కిశోర్, శంకర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
దుగ్గరాజపట్నం పోర్టుకు ఆ ఇద్దేరే అడ్డంకి
తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ధ్వజం చిట్టమూరు: వాకాడు మండలం దుగ్గరాజపట్నం పోర్టుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబునాయుడే అడ్డంకని కాంగ్రెస్ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. చిట్టమూరులో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోర్టు వస్తే లక్షల మంది రైతులు, వేలాది మంది నిరుద్యోగులు బతుకులు బాగుపడతాయన్నారు. కానీ వెంకయ్యనాయుడు, చంద్రబాబులు ఇద్దరూ కమ్మక్కై పోర్టు రానివ్వకుండా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ పోర్టుకు పక్కనే ఉన్న ఓ ప్రవేటు పోర్టు యజమానులకు లొంగిపోయి తమ స్వప్రయోజనాలకు పోర్టు ద్వారా హెలికాప్లర్లు వాడుకుంటూ ప్రభుత్వ పోర్టు నిర్మాణం చేపట్టకుండా చూస్తున్నారని ఆరోపించారు. రూ.25 వేల కోట్లతో నిర్మాణం జరిగే వి«దంగా ప్రణాళికలు తయారు చేశారన్నారు. డిసెంబర్ 31 లోపు పోర్టు నిర్మాణ పనులు చేపట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వర్ణభారత్ ట్రస్టులో అన్నీ అక్రమాలే జరుగుతున్నాయని చింతామోహన్ ఆరోపించారు. -
ఎన్టీఆర్‌కు పార్టీ పెట్టమని చెప్పింది నువ్వా
రంగులుపూసుకునేవాడికి పార్టీ ఎందుకని అనింది చంద్రబాబు చిత్తూరులో టీడీపీ జెండాలను తగలపెట్టింది బాబే వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ రెడ్డి ఇందుకూరుపేట : ఎన్టీ రామారావుకు పార్టీ పెట్టమని చెప్పింది నువ్వా అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సీఎం చంద్రబాబునాయుడ్ని ప్రశ్నించారు. నోరు తెరిస్తే చంద్రబాబునాయుడు మాట్లాడేది అబద్ధాలేనని అని ఆయన మండిపడ్డారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేటలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబునాయుడు శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలు అతను అబద్ధాల కోరు అని చెప్పడానికి నిదర్శనమన్నారు. ఎన్టీ రామారావు కుమార్తెతో ఆయనకు పెళ్లి కుదిర్చింది ఆయన కుమారుడు జయకృçష్ణ, విశ్వేశ్వరరావులని చంద్రబాబునాయుడు అన్నాడన్నారు. అయితే వాస్తవానికి సంబంధం కుదిర్చింది శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం నాయుడని తెలిపారు. ఎన్టీఆర్‌ను పార్టీపెట్టమని తానే సూచించానని చంద్రబాబు ప్రగల్భాలు పలికాడన్నారు. రామారావు పార్టీ స్థాపించే రోజుల్లో రంగులు పూసుకునే వాడికి రాజకీయాలు ఎందుకని అనింది చంద్రబాబునాయుడన్నారు. కాంగ్రెస్‌లో ఉంటూ చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండాలు తగలబెట్టించింది చంద్రబాబేనని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ నుంచి ఆదేశిస్తే రామారావుపై పోటీ చేస్తానని చెప్పింది చంద్రబాబేనన్నారు. అయితే హైదరాబాద్‌లో విలేకర్లు రామారావుపై పోటీ చేస్తానని చెప్పింది మీరే కాదా అని ప్రశ్నిస్తే కాదని చంద్రబాబునాయుడు బుకాయించారన్నారు. చంద్రబాబును అప్పట్లో టీడీపీలో చేర్చుకునేందుకు నాదెండ్ల భాస్కరరావు, ఆయన వర్గం ఒప్పుకోలేదని, ఆ సమయంలో తన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఉపేంద్ర తీసుకోమని చెప్పారన్నారు. నిండు శాసనమండలిలో చంద్రబాబునాయుడు కార్చింది మొసలి కన్నీరన్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించినప్పుడు కన్నీళ్లు రాలేదా, అనారోగ్యంతో ఉన్న తండ్రి కర్జూరపునాయుడ్ని పీఏ రూంలో ఉంచి గాలికొదిలేనప్పుడు రాలేదనా కన్నీరు అని ప్రసన్నకుమార్ రెడ్డి ప్రశ్నించారు. నిన్ను కన్న తల్లి అమ్మణ్నమ్మ తమను పట్టించుకోవడం లేదని ఇంటికి వెళ్లిన వారితో చెప్పినప్పుడు ఏమయ్యాయి ఆ కన్నీళ్లు అని ఆయన ప్రశ్నించారు. పదో తరగతి చదివే లోకేష్‌ను ప్రధామంత్రి కావాలా అని ^è ంద్రబాబునాయుడు అడిగితే వద్దని చెప్పాడని, అందుకే కాలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. లోకేష్ పప్పు సుద్ద అని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాట్లాడిన మాటలు అందుకు నిదర్శనమన్నారు. సైకిల్ గుర్తుకు ఓటేస్తే మనకు మనం ఆత్మహత్య చేసుకున్నట్లేనని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాట్లాడింది లోకేష్ అని, కుల పిచ్చి, మతపిచ్చి ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీకేనని మాట్లాడింది లోకేష్ అని ఆయన గుర్తు చేశారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిందికూడా తానేనని చంద్రబాబునాయుడు చెప్పడం అతని దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. పీవీ సింధుకు రియో ఒలంపిక్సలో పతకం వచ్చేలా చేసింది తానేనని, గోపీచంద్‌కు శిక్షణ ఇచ్చింది తానేనని , రాష్ట్ర ప్రజలకు పెళ్లిళ్లు చేసింది తానేనని చెప్పినా ఆశ్చర్చపోనక్కర్లేదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మావులూరి శ్రీనివాసులురెడ్డి, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి విజయ్‌కుమార్, జెడ్పీటీసీ బీవీ రమణయ్య పాల్గొన్నారు.