ఎన్టీఆర్‌కు పార్టీ పెట్టమని చెప్పింది నువ్వా
-
రంగులుపూసుకునేవాడికి పార్టీ ఎందుకని అనింది చంద్రబాబు
-
చిత్తూరులో టీడీపీ జెండాలను తగలపెట్టింది బాబే
-
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ రెడ్డి
ఇందుకూరుపేట :
ఎన్‌టీ రామారావుకు పార్టీ పెట్టమని చెప్పింది నువ్వా అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సీఎం చంద్రబాబునాయుడ్ని ప్రశ్నించారు. నోరు తెరిస్తే చంద్రబాబునాయుడు మాట్లాడేది అబద్ధాలేనని అని ఆయన మండిపడ్డారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్‌పేటలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబునాయుడు శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలు అతను అబద్ధాల కోరు అని చెప్పడానికి నిదర్శనమన్నారు. ఎన్‌టీ రామారావు కుమార్తెతో ఆయనకు పెళ్లి కుదిర్చింది ఆయన కుమారుడు జయకృçష్ణ, విశ్వేశ్వరరావులని చంద్రబాబునాయుడు అన్నాడన్నారు. అయితే వాస్తవానికి సంబంధం కుదిర్చింది శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం నాయుడని తెలిపారు. ఎన్టీఆర్‌ను పార్టీపెట్టమని తానే సూచించానని చంద్రబాబు ప్రగల్భాలు పలికాడన్నారు. రామారావు పార్టీ స్థాపించే రోజుల్లో రంగులు పూసుకునే వాడికి రాజకీయాలు ఎందుకని అనింది చంద్రబాబునాయుడన్నారు. కాంగ్రెస్‌లో ఉంటూ చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండాలు తగలబెట్టించింది చంద్రబాబేనని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ నుంచి ఆదేశిస్తే రామారావుపై పోటీ చేస్తానని చెప్పింది చంద్రబాబేనన్నారు. అయితే హైదరాబాద్‌లో విలేకర్లు రామారావుపై పోటీ చేస్తానని చెప్పింది మీరే కాదా అని ప్రశ్నిస్తే కాదని చంద్రబాబునాయుడు బుకాయించారన్నారు. చంద్రబాబును అప్పట్లో టీడీపీలో చేర్చుకునేందుకు నాదెండ్ల భాస్కరరావు, ఆయన వర్గం ఒప్పుకోలేదని, ఆ సమయంలో తన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఉపేంద్ర తీసుకోమని చెప్పారన్నారు. నిండు శాసనమండలిలో చంద్రబాబునాయుడు కార్చింది మొసలి కన్నీరన్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించినప్పుడు కన్నీళ్లు రాలేదా, అనారోగ్యంతో ఉన్న తండ్రి కర్జూరపునాయుడ్ని పీఏ రూంలో ఉంచి గాలికొదిలేనప్పుడు రాలేదనా కన్నీరు అని ప్రసన్నకుమార్ రెడ్డి ప్రశ్నించారు. నిన్ను కన్న తల్లి అమ్మణ్నమ్మ తమను పట్టించుకోవడం లేదని ఇంటికి వెళ్లిన వారితో చెప్పినప్పుడు ఏమయ్యాయి ఆ కన్నీళ్లు అని ఆయన ప్రశ్నించారు. పదో తరగతి చదివే లోకేష్‌ను ప్రధామంత్రి కావాలా అని ^è ంద్రబాబునాయుడు అడిగితే వద్దని చెప్పాడని, అందుకే కాలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. లోకేష్ పప్పు సుద్ద అని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాట్లాడిన మాటలు అందుకు నిదర్శనమన్నారు. సైకిల్ గుర్తుకు ఓటేస్తే మనకు మనం ఆత్మహత్య చేసుకున్నట్లేనని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాట్లాడింది లోకేష్ అని, కుల పిచ్చి, మతపిచ్చి ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీకేనని మాట్లాడింది లోకేష్ అని ఆయన గుర్తు చేశారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిందికూడా తానేనని చంద్రబాబునాయుడు చెప్పడం అతని దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. పీవీ సింధుకు రియో ఒలంపిక్‌సలో పతకం వచ్చేలా చేసింది తానేనని, గోపీచంద్‌కు శిక్షణ ఇచ్చింది తానేనని , రాష్ట్ర ప్రజలకు పెళ్లిళ్లు చేసింది తానేనని చెప్పినా ఆశ్చర్చపోనక్కర్లేదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మావులూరి శ్రీనివాసులురెడ్డి, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి విజయ్‌కుమార్, జెడ్పీటీసీ బీవీ రమణయ్య పాల్గొన్నారు.