Prasanna kumar reddy
-
ఫ్యామిలీతో ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్
-
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన పాపాలు.. మొత్తం బయటపెట్టిన ప్రసన్నకుమార్ రెడ్డి..
-
వేమిరెడ్డి పై ప్రసన్న కుమార్ రెడ్డి ఫైర్
-
ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మహారుద్రాభిషేకం..
-
టీడీపీపై ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సెటైర్లు..
-
చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఫైర్
-
పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఫైర్
-
శత్రువుని కూడా దగ్గరకు తీసుకునే తత్వం
-
ఇద్దరు పిచ్చోళ్లతో అనర్థమే
సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం: మాజీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ నాయకుడు పవన్‌కల్యాణ్ మూడు రాజధానుల విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని, ఇద్దరు పిచ్చోళ్లతో అనర్థమేనని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. మండలంలోని దామరమడుగు, రేబాల, జొన్నవాడ గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అభిప్రాయాన్ని శాసనసభలో తెలిపారన్నారు. దీనిపై చంద్రబాబు, అతను ఇచ్చే సూట్‌కేసులకు అమ్ముడుపోయిన పవన్‌కల్యాణ్ రాజధాని ప్రజలను రెచ్చగొట్టి గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. రాజధాని మారితే అక్కడ ప్రజలు భూములను దోచుకున్న చంద్రబాబు అండ్ కో నేతలకు నష్టమని ఏవేవో మాట్లాడుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అన్ని ప్రాంతాల సమస్యలను తెలుసుకున్నారని, వాటన్నింటిని అభివృద్ధి చేయాలనే సీఎం మూడు రాజధానులను ప్రకటించినట్లు వివరించారు. దిశ చట్టం దేశానికే తలమానికంగా మారిందన్నారు. మహిళల రక్షణకు ఎంతో ఉపయోగపడేలా చట్టం ఉందన్నారు. దీనిపై అన్ని రాష్ట్రాల నేతలు దృష్టి సారించారని ఆయన తెలిపారు. ‘నాడు–నేడు’తో పాఠశాలలకు పెద్దపీట సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నాడు–నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందనున్నాయన్నారు. రాష్ట్రంలోని 45,512 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.12 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. ఇందు లో తొలివిడతగా 15,715 పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు రూ.3,500 కోట్లు కేటాయించారని, నియోజకవర్గంలో 100 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. -
చంద్రబాబు అవినీతిచక్రవర్తి
బుచ్చిరెడ్డిపాళెం: ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిచక్రవర్తి అని వైఎస్సార్సీపీ కోవూరు నియోజకవర్గ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని కాగులపాడు, శ్రీరంగరాజపురంలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయస్థాయి కుంభకోణం జరిగిందన్నారు. రాజధాని నిర్మాణం పేరిట సీఎం చంద్రబాబు బినామీలుగా మంత్రి నారాయణ, సీఎం రమేష్, లింగంనేని రమేష్, కంభంపాటి రామ్మోహన్‌రావును పెట్టుకుని భూదోపిడీకి పాల్పడ్డారన్నారు. ముందుగానే రాజధాని పక్కన భూములను అక్కడి రైతులను భయపట్టి తక్కువ ధరలకు కొనుగోలు చేసి చంద్రబాబునాయుడు రూ.కోట్లకు పడగలెత్తాడన్నారు. రూ.4 లక్షల కోట్ల అవినీతి చోటు చేసుకుందన్నారు. చంద్రబాబుది అప్రజాస్వామిక పాల న అని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా తొలి నుంచి ప్రజల మధ్యే ఉన్నాడ ని, పోరాటాలు చేస్తూనే ఉన్నారన్నారు. ప్రత్యేక హో దా కోసం పోరాడింది జగన్మోహన్రెడ్డి అని గుర్తుచేశారు. అందుకే ప్రజా సంక్షేమం కోసం నవరత్నా ల పథకాలను ప్రవేశపెట్టారన్నారు. జగన్మోహన్రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. శాసనసభకు తనను, పార్లమెంట్‌కు ఆదాల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు చీమల రమేష్‌బాబు, నెల్లూరు గోపాల్‌రెడ్డి, పగడాల కృష్ణారెడ్డి, బిల్లా వినోద్‌కుమార్, సూరా శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరిక కాగులపాడుకు చెందిన టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి బీద మస్తాన్ రావు మేనల్లుడు దాసరి శ్రీకాంత్‌తో పాటు వి.హరిబాబు, పి.శ్రీనివాసులు, కల్వకుంట్ల రమేష్‌నాయుడు, గురవయ్య, పగడాల శ్రీనివాసులురెడ్డి. పుత్తేటి శివారెడ్డి, విజయ్‌కుమార్, స్వాములురెడ్డి, బాబిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, బొనిగల సుబ్బయ్య తదితరులు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి ప్రసన్నకుమార్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. -
చంద్రబాబు, వెంకయ్యలే దానికి కారకులు..
కోవూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు మోసగించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. కోవూరులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా పార్టీ ఎంపీలు ఢిల్లీ లో ఆమరణ దీక్ష చేస్తున్నారని చెప్పారు. వీరికి మద్దతుగా పార్టీ పిలుపు మేరకు కోవూరులో రిలే దీక్షలు జరుగుతున్నాయన్నారు. వెంకయ్యనాయుడు తలుచుకుంటే ప్రధాని మోదీతో మాట్లాడి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని, అయితే మీనమేషాలను ఎందుకు లెక్కిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. విశ్వసనీయత కు జగన్మోహన్రెడ్డి నిదర్శనమన్నారు. ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తోంది జగన్మోహన్రెడ్డేనని చెప్పారు. చంద్రబాబు ఢిల్లీలోని టీడీపీ ఎంపీలకు ఫోన్ చేసి నాటకాల కా ర్యక్రమం ముగిసిపోయిందని, ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభిస్తామని.. అమరావతికి రమ్మని చెప్పారని విమర్శించారు. లోకేష్, బాబుకు మతిభ్రమించింది ప్రత్యేక హోదా వచ్చేంత వరకూ ప్రజల మధ్యలో ఉండి పోరాటాలు చేస్తామని మంత్రి లోకేష్ చెప్పారని, ముందు టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించి ప్రజల్లోకి రావాలని సూచించారు. చంద్రబాబు మంచితనం, మానవత్వాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని లోకేష్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబుకు వెన్నుపోట్లు, అబద్దాలు, మోసం, అవినీతి, అక్రమాలు, వంచించడం వెన్నెతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మంత్రి కొల్లు రవీంద్ర, కాలువ శ్రీనివాసులు జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. మోదీతో తాము లాలూచీ పడి ఉంటే రాజీనామాలు చేయకుండానే ఉండవచ్చన్నారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని భయపడి నరేంద్రమోదీ కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకుంటున్నారని విమర్శించారు. ఒక పక్క ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్నామంటూనే మరో వైపు మంత్రులను మోదీ వద్దకు పంపి కాలం వెళ్లదీస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగేళ్లలో ప్రజల రక్తం తాగి టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కొవ్వుపట్టి ఉందన్నారు. 70 ఏళ్లు దాటిన ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్ వయోభారాన్ని లెక్కచేయకుండా ప్రజల శ్రేయస్సు కోసం ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యల కోసం పోరాడేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా విషయంలో చంద్రబా బు డ్రామాలను పక్కనబెట్టి ప్రజల వద్దకు రావాలని హితవు పలికారు. నిరంజన్‌బాబురెడ్డి, రాధాకృష్ణారెడ్డి, శ్రీని వాసులురెడ్డి, మల్లికార్జునరెడ్డి, నరసింహులురెడ్డి, జనార్దన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
రైతుల బాధలు పట్టవా..?
బుచ్చిరెడ్డిపాళెం: ఆరుగాలం శ్రమించి పండించిన పంట దళారుల పాలవుతున్నా రైతుల బాధ అధికారులకు పట్టడంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 162 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తానన్న కలెక్టర్ నేటికీ పూర్తిగా ఏర్పాటు చేసిన దాఖలాల్లేవన్నారు. మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీని నేటికీ ఇవ్వలేదని, ఈ మేరకు లెటర్ ఆఫ్ అండర్ స్టాండింగ్ జరగకపోవడం దారుణమన్నారు. « ఈ క్రమంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన పుట్టికి రూ.13,515 మద్దతు ధర ఎక్కడా అమలు కావడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గతేడాది 8 లక్షల ఎకరాల్లో సాగు చేసిన వరి ఈ ఏడాది ఏడు లక్షల ఎకరాలకే పరిమితమైందన్నారు. విధిలేని పరిస్థితుల్లో దళారులకు రైతులు పుట్టి ధాన్యాన్ని రూ.11,800కు శనివారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విక్రయించారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులు రైతులను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. మద్దతు ధరలు లభించక దళారుల చేతుల్లో బలవుతున్నామని కోవూరులో రిలే దీక్షలు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జాయింట్ కలెక్టర్, మిల్లర్లు కుమ్మక్కై రైతులను నిలువునా దగా చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణ, అమర్నాథ్రెడ్డి పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా మంత్రులు అధికారులతో సమావేశాలను నిర్వహించి పుట్టి ధాన్యానికి రూ.18 వేల మద్దతు ధర ఇవ్వాలని, లేని పక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. -
చంద్రబాబు పచ్చిమోసకారి
ప్రసన్నకుమార్‌రెడ్డి కోవూరు: హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచిన పచ్చి మోసకారి చంద్రబాబు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాలెం తిప్పగిరిజన కాలనీలో ఆదివారం నిర్వహించిన రచ్చబండ – పల్లెనిద్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో కోవూరు చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విస్మరించారని ఆరోపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు నాలుగు కమిటీలు కర్మాగారాన్ని పరిశీలించి నివేదికలను ప్రభుత్వానికి అందజేశాయని, ఇందులోని అంశాలను అధికార పార్టీ నాయకులు బహిర్గతం చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఉద్యోగులకు రూ.20.77 కోట్లను చెల్లించాల్సి ఉందని, అయితే వీటిని అందజేయకుండా కడుపుకొట్టడం తగదని హితవు పలికారు. చంద్రబాబుకు కొడుకుపైన, సీఎం కుర్చీపై ఉన్న ముక్కువ రాష్ట్ర ప్రజలపై లేదని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.కోట్లను వెనుకేసుకునేందుకు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ విజయం సాధించిన వెంటనే పునఃప్రారంభం రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన మరుక్షణమే రూ.50 కోట్లను కేటాయించి కోవూరు చక్కెర కర్మాగారాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. జగన్మోహన్రెడ్డి పాదయాత్ర కోవూరులో జరిగే సమయంలో చక్కెర కర్మాగారానికి సంబంధించి స్పష్టమైన హామీని ఇవ్వనున్నారన్నారు. యనమల రామకృష్ణుడికి జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. విదేశాల్లో నల్లధనాన్ని దాచిపెట్టారంటూ జగన్మోహన్రెడ్డిపై బాబు, ఆయన కోటరీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారికి ఏ మాత్రం చిత్తశుద్ధి, సిగ్గు ఉన్నా 15 రోజుల్లో ఆరోపణలను రుజువు చేయాలన్నారు. తెలంగాణ నీరుపారుదల శాఖలో యనమల రూ.రెండు వేల కోట్ల పనులు తీసుకున్నారనే రేవంత్‌రెడ్డి విమర్శలను ప్రస్తావించారు. యనమల నీచచరిత్ర ప్రజలకు తెలుసునన్నారు. జగన్మోహన్రెడ్డి పాదయాత్రపై బాబు కోటరీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌బాబురెడ్డి, రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, శివుని నరసింహులురెడ్డి, పార్టీ మండల కన్వీనర్ నలబోలు సుబ్బారెడ్డి, గాజుల మల్లికార్జున, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
'వారికి ప్రజా సంక్షేమం గురించి తెలియదు'
-
'వారికి ప్రజా సంక్షేమం గురించి తెలియదు'
నెల్లూరు: మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్‌లకు వ్యాపారాలు తప్ప ప్రజా సంక్షేమం గురించి తెలియదని వైఎస్ఆర్ సీపీ నాయకుడు ఎన్ ప్రసన్నకుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. అందర్ని కలుపుకొని పోకుండా అభివృద్ధిలో వివక్ష చూపడం తగదని వారిద్దరు ప్రసన్నకుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం నెల్లూరులో నిరాహార దీక్ష చేస్తున్న నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌ను ప్రసన్నకుమార్ రెడ్డి పరామర్శించారు. ఆయన దీక్షకు ప్రసన్నకుమార్ సంఘీభావం ప్రకటించారు. నెల్లూరు నగర అభివృద్ధిపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తు.. అనిల్ కుమార్ రెడ్డి బుధవారం నుంచి నిరాహారదీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. -
ఇరిగేషన్ పనుల్లో రూ.400 కోట్ల అవినీతి
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇందుకూరుపేట: జిల్లాలో నీటిపారుదల శాఖ పనుల్లో రూ.400 కోట్లు తెలుగుతమ్ముళ్లు, అధికారులు దిగమింగారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. మండలంలోని ముదివర్తిపాలెంలో సోమవారం గడగడపకు వైఎస్సార్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మట్లాడారు. ఒక్క కోవూరు నియోజవర్గంలోనే రూ.50 కోట్ల అవినీతి జరిగిందన్నారు. దీనికి ప్రధాన కారకులు కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అని విమర్శించారు. పనులు ఎక్కడా సక్రమంగా జరిగిన పాపాన పోలేదన్నారు. పది రోజుల నుంచి ఇరిగేషన్ అవినీతిపై అన్ని పత్రికల్లో పతాక స్థాయిలో శీర్షికలు ప్రచురితమవుతున్నాయన్నారు. ఎమ్మెల్యే పోలంరెడ్డి అనుచరులు, బంధువులు రూ.కోట్లు పనులు చేయకుండానే ఇరిగేషన్ డబ్బును డ్రా చేశారని వివరించారు. పోలంరెడ్డి బావ మాతూరు రామసుబ్బారెడ్డి, అయన సోదరడు దశరథరామిరెడి, సొంత తమ్ముడు నీటి సంఘం నాయకులు వెంకటేశ్వరరెడ్డి బినామీలుగా వ్యవహరిస్తున్నారన్నారు. చెముకుల చైతన్య, కోటంరెడ్డి అమరేంద్రనాథ్‌రెడ్డి అనేవారు ఎమ్మెల్యే అనుచరులు మాత్రమేనన్నారు. వీరికి ఇరిగేషన్ శాఖలో ఎలాంటి పదవి, హోదాలు లేవన్నారు. బ్యాంకుల నుంచి రూ.54 లక్షలు డ్రా చేశారని వీరి అవినీతికి నిదర్శననానికి ఇది ఒక శాంపిల్ మాత్రమేనని చెప్పారు. ఎమ్మెల్యే తిన్న డబ్బాంతా రికవరీ చేసి అధికారులు పర్సంటేజీలను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మావులూరు శ్రీనివాసులురెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి విజయ్‌కుమార్, జెడ్పీటీసీ బీవీ రమణయ్య పాల్గొన్నారు. -
ఎన్టీఆర్‌కు పార్టీ పెట్టమని చెప్పింది నువ్వా
రంగులుపూసుకునేవాడికి పార్టీ ఎందుకని అనింది చంద్రబాబు చిత్తూరులో టీడీపీ జెండాలను తగలపెట్టింది బాబే వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ రెడ్డి ఇందుకూరుపేట : ఎన్టీ రామారావుకు పార్టీ పెట్టమని చెప్పింది నువ్వా అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సీఎం చంద్రబాబునాయుడ్ని ప్రశ్నించారు. నోరు తెరిస్తే చంద్రబాబునాయుడు మాట్లాడేది అబద్ధాలేనని అని ఆయన మండిపడ్డారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేటలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబునాయుడు శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలు అతను అబద్ధాల కోరు అని చెప్పడానికి నిదర్శనమన్నారు. ఎన్టీ రామారావు కుమార్తెతో ఆయనకు పెళ్లి కుదిర్చింది ఆయన కుమారుడు జయకృçష్ణ, విశ్వేశ్వరరావులని చంద్రబాబునాయుడు అన్నాడన్నారు. అయితే వాస్తవానికి సంబంధం కుదిర్చింది శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం నాయుడని తెలిపారు. ఎన్టీఆర్‌ను పార్టీపెట్టమని తానే సూచించానని చంద్రబాబు ప్రగల్భాలు పలికాడన్నారు. రామారావు పార్టీ స్థాపించే రోజుల్లో రంగులు పూసుకునే వాడికి రాజకీయాలు ఎందుకని అనింది చంద్రబాబునాయుడన్నారు. కాంగ్రెస్‌లో ఉంటూ చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండాలు తగలబెట్టించింది చంద్రబాబేనని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ నుంచి ఆదేశిస్తే రామారావుపై పోటీ చేస్తానని చెప్పింది చంద్రబాబేనన్నారు. అయితే హైదరాబాద్‌లో విలేకర్లు రామారావుపై పోటీ చేస్తానని చెప్పింది మీరే కాదా అని ప్రశ్నిస్తే కాదని చంద్రబాబునాయుడు బుకాయించారన్నారు. చంద్రబాబును అప్పట్లో టీడీపీలో చేర్చుకునేందుకు నాదెండ్ల భాస్కరరావు, ఆయన వర్గం ఒప్పుకోలేదని, ఆ సమయంలో తన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఉపేంద్ర తీసుకోమని చెప్పారన్నారు. నిండు శాసనమండలిలో చంద్రబాబునాయుడు కార్చింది మొసలి కన్నీరన్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించినప్పుడు కన్నీళ్లు రాలేదా, అనారోగ్యంతో ఉన్న తండ్రి కర్జూరపునాయుడ్ని పీఏ రూంలో ఉంచి గాలికొదిలేనప్పుడు రాలేదనా కన్నీరు అని ప్రసన్నకుమార్ రెడ్డి ప్రశ్నించారు. నిన్ను కన్న తల్లి అమ్మణ్నమ్మ తమను పట్టించుకోవడం లేదని ఇంటికి వెళ్లిన వారితో చెప్పినప్పుడు ఏమయ్యాయి ఆ కన్నీళ్లు అని ఆయన ప్రశ్నించారు. పదో తరగతి చదివే లోకేష్‌ను ప్రధామంత్రి కావాలా అని ^è ంద్రబాబునాయుడు అడిగితే వద్దని చెప్పాడని, అందుకే కాలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. లోకేష్ పప్పు సుద్ద అని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాట్లాడిన మాటలు అందుకు నిదర్శనమన్నారు. సైకిల్ గుర్తుకు ఓటేస్తే మనకు మనం ఆత్మహత్య చేసుకున్నట్లేనని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాట్లాడింది లోకేష్ అని, కుల పిచ్చి, మతపిచ్చి ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీకేనని మాట్లాడింది లోకేష్ అని ఆయన గుర్తు చేశారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిందికూడా తానేనని చంద్రబాబునాయుడు చెప్పడం అతని దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. పీవీ సింధుకు రియో ఒలంపిక్సలో పతకం వచ్చేలా చేసింది తానేనని, గోపీచంద్‌కు శిక్షణ ఇచ్చింది తానేనని , రాష్ట్ర ప్రజలకు పెళ్లిళ్లు చేసింది తానేనని చెప్పినా ఆశ్చర్చపోనక్కర్లేదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మావులూరి శ్రీనివాసులురెడ్డి, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి విజయ్‌కుమార్, జెడ్పీటీసీ బీవీ రమణయ్య పాల్గొన్నారు. -
రాజీనామా చేయలేదు..జగన్‌తోనే ఉంటా
-
అభినవ కీచకులు ఆ ముగ్గురు
అభినవ కీచకులు ఆ ముగ్గురు బుచ్చిరెడ్డిపాళెం, : సోనియాగాంధీ, చంద్రబాబు, బీజేపీ నాయకులు రాష్ట్ర విభజన విషయంలో అభినవ కీచకులుగా మారారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పి లుపు మేరకు పార్టీ శ్రేణులు పట్టణం లోని వైఎస్సార్ విగ్రహం వద్ద బుధవా రం రాస్తారోకో నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్లమెంట్లో మంగళవారం టీబిల్లును ప్ర వేశపెట్టడం నర్తనశాలను తలపించిందన్నారు. రెండు ప్రాంతాల్లో రాజకీయం గా పార్టీ ఎదుగుదలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇరు ప్రాంతాల నాయకులను రెచ్చగొట్టారన్నారు. త మ నాయకుడి వల్లే తెలంగాణ వచ్చిం దని టీడీపీ తెలంగాణ నేతలు నామా నాగేశ్వరరావు, యర్రబల్లి దయాకర్రా వు చెప్పడం దీనికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు రాజకీయ వ్యభిచారులుగా మారాయని దుయ్యబ ట్టారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేసేం దుకు సోనియా, రెండు ప్రాంతాల్లో పా ర్టీ ఎదుగుదలకు చంద్రబాబు రాష్ట్ర విభజనకు కారకులయ్యారన్నారు. తొలి నుంచి సమైక్యాంధ్ర కోసం పోరాడిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే స మైక్యవాదిగా మిగిలారన్నారు. జొన్నల గడ్డ నారాయణరావు, కోడూరు మధుసూదన్‌రెడ్డి, యామాల మోహన్, కత్తి శేషయ్య, పిడుగు మధు, మల్లు జయరామిరెడ్డి, నెల్లూరు నాగేశ్వరరావు, చెల్లాయపాళెం, ఉప సర్పంచ్ మురళీ, నాగాయగుంట సర్పంచ్ రాజశేఖర్, వెంకట్రావు, చిన్న అల్లాబక్షు, తాజుద్దీన్, మున్నా పాల్గొన్నారు. సీఎం రాజీనామా చేసి ఏం లాభం సీడబ్ల్యూసీ తీర్మానం చేసినపుడే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసి ఉం డాల్సిందని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంట్లో టీ బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాజీనామా చేసి ఏం ఉపయోగమని ఆయన ప్రశ్నిం చారు. కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి, పార్టీ నే తలు మేనకూరు సీతారామిరెడ్డి, కలువ బాలశంకర్‌రెడ్డి, గుమ్మా సుధాకరయ్య, షేక్ కరీముల్లా(బాబు), జబీవుల్లా, ఫ యాజ్బాషా, అహ్మద్‌బాషా, గుమ్మా సు దాకరయ్య, నాగేశ్వరరావు, బొంతా హరిబాబుయాదవ్ పాల్గొన్నారు. రాష్ట్ర విభజన దారుణం ఇందుకూరుపేట: సీమాంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని వి భజించడం దారుణమని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మం డలంలో బుధవారం బంద్ నిర్వహిం చారు. ఆరోమైలు కూడలిలో రాస్తారో కో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తీరు అప్రజాస్వామికమన్నారు. దుర్మార్గంగా రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. నాయకులు వెంకటకృష్ణారెడ్డి, వెంకటరమణారెడ్డి, కుమార్‌రెడ్డి, నారాయణరెడ్డి, కృష్ణప్రసాద్, మల్లికార్జునరెడ్డి, బాబయ్య, కృష్ణ, మహి, ఉమ, రవి, సర్పంచ్‌లు బాలబొమ్మ వెంకటేశ్వర్లు, గూడూరు జయరామయ్య, తాతా సురేంద్ర పాల్గొన్నారు. అలాగే జీ ఎస్సార్ యువసేన ఆధ్వర్యంలో ఇందుకూరుపేట, కొత్తూరు గ్రామాల్లో దుకాణలు, పాఠశాలలు, బ్యాంకులు, ప్రభు త్వ కార్యాలయాలను మూసివేయించా రు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. గురజాల జ్ఞానస్వరూప్, సూదలగుంట వెంకటేశ్వరనాయుడు, భాస్కర్‌నాయుడు, గోళ్ల రవీంద్రరావు, శ్రీకాంత్‌రెడ్డి, చక్రి, ఉపసర్పంచ్ వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాస్తారోకో కోవూరు: రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సాయిబాబా గుడి సమీపంలో జాతీయరహదారిపై బైఠాయిం చి వాహనాల రాకపోకలను అడ్డుకున్నా రు. దీంతో సుమారు 8 కిలోమీటర్ల మే ర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీమాం ధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభజించడం దారుణమన్నారు. సోనియాగాంధీ నియంతలా వ్యవహరించి లోక్‌సభలో బిల్లును ఆ మోదింపజేయడం దుర్మార్గమన్నారు. పదవుల కోసం పాకులాడే సీమాంధ్ర నే తలు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. నాటి బ్రిటిష్ పాలకులు ఇండియా నుంచి పాకిస్తాన్‌ను విభజిస్తే ప్రస్తుతం ఇటలీ నియంత సోనియాగాంధీ రాష్ట్ర విభజనకు పాల్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో ములమూడి వినోద్‌రెడ్డి, రా ధాకృష్ణారెడ్డి, సర్పంచ్ కూట్ల ఉమ, ఉపసర్పంచ్ మల్లారెడ్డి, నిరంజన్బాబురె డ్డి, మల్లికార్జున్‌రెడ్డి, నరసింహులురెడ్డి, అట్లూరి సుబ్రహ్మణ్యం, మంచి శ్రీనివాసులు,డాక్టర్ శీనయ్య, సీతారామిరెడ్డి, మారం వినయ్‌కుమార్‌రెడ్డి, జనార్దన్‌రె డ్డి,శ్రీనివాసులురెడ్డి, బాబురె డ్డి,సుబ్బారెడ్డి,ఉయ్యూరువేణు ఉన్నారు. లేగుంటపాడులో... రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మండలంలోని లేగుంటపాడులో వైఎస్సార్సీ పీ నాయకులు నిరసన తెలిపారు. ఇనమడుగు-ముదివర్తి రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మారం వినయ్‌కుమార్‌రెడ్డి, సాయిరెడ్డి, మనోజ్, సూర్యారెడ్డి, రాజా ,వంశీనాయుడు, మోహన్సాయినాయుడు, సందీప్, మనోజ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. బిల్లు ఆమోదం అప్రజాస్వామికం విడవలూరు: పార్లమెంట్లో టీ బిల్లు ఆ మోదించిన తీరును చూస్తే సామాన్య మానవునికి కూడా అసలు ప్రజాస్వామ్యం ఉందా అనే ప్రశ్న తలెత్తుతుందని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ విడవలూరులో వైఎస్సార్సీపీ నాయకు లు చేపట్టిన బంద్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభజించడం దారుణమన్నారు. చెన్నారెడ్డి హయాంలో పెద్దఎత్తున తెలంగా ణ ఉద్యమం నడిచినా రాష్ట్ర విభజన మంచిదికాదని ఇందిరాగాంధీ స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు. ఆమె కోడలు సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజిం చ డం దారుణమన్నారు. సమైక్యాంధ్ర కో సం వైఎస్సార్సీపీ నాయకుడు జగన్మోహన్రెడ్డి దేశంలోని అన్ని ప్రాంతాల నాయకులను కలుసుకుని పోరాడినట్లు గుర్తుచేశారు. పార్టీ మండల కన్వినర్ బె జవాడ గోవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర యువజన వి భాగం సభ్యుడు ఓగు నాగేశ్వరరావు, నాయకులు కొండూరు వెంటకసుబ్బారె డ్డి, వీరిచలపతిరావు, మాతూరు శ్రీని వాసులరెడ్డి, అనపల్లి ఉదయ్‌భాస్కర్, నిరంజన్‌బాబురెడ్డి, పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ బంద్ విజయవంతం కొడవలూరు: రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు మం డలంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఆ ద్వర్యంలో నార్తురాజుపాళెంలో జాతీ య రహదారిపైకి చేరుకుని వాహనాలను నిలిపి వేశారు. దీంతో సుమారు పది కిలో మీటర్ల దూరం వాహనాలు బారులు తీరి నిలిచిపోవడంతో రాకపోకలు స్తంభించాయి.జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వీరి చలపతిరావు, నల్లావుల శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ పిట్టి సూరి, మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, నాయకులు పెనాక శ్రీనివాసులురెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, నందకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఇక కాంగ్రెస్ పని ఖతం
కోవూరు, న్యూస్‌లైన్ : నాలుగు రాష్ట్రాల ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ పార్టీకీ మైండ్‌బ్లాక్ అయిందని, ఇక ఆ పార్టీ పని ఖతమేనని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని పడుగుపాడు ఇనమడుగు సెంటర్లో సోమవారం ఆయన ఓ సిమెంటు, స్టీలు దుకాణాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెత్తు పోకడలతో ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించారన్నారు. 2014లో ఎన్నికల అనంతరం సోనియాగాంధీ ఇటలీకి మకాం మార్చాల్సిందేనని ప్రస న్న జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి మకుటంలేని మహరాజుగా 30 ఏళ్ల పాటు సీఎంగా ఏకఛత్రాధిపతిగా పరిపాలన చేస్తారన్న ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల వారికి అండగా ఉంటూ ఏ సమస్య వచ్చినా తానున్నాననే భరోసా ఇస్తూ ఆదుకుంటారని తెలిపారు. 2014 సాధారణ ఎన్నికల్లో 175 అసెంబ్లీ , 25 పార్లమెంటు స్థానాలను వైఎస్సార్సీపీ కైవశం చేసుకోవడం తథ్యమన్నారు. ఢిల్లీలో వైఎస్ జగన్ చక్రం తిప్పడం ఖాయమన్నారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ములుముడి వినోద్‌రెడ్డి, జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, నిరంజన్‌బాబురెడ్డి, రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, ములుముడి సుబ్బరామిరెడ్డి, మోడెం శ్రీనివాసులురెడ్డి, అట్లూరి సుబ్రహ్మణ్యం, అన్నూ, చేజర్ల సీతారామిరెడ్డి, శ్రీనివాసులు, నారాయణ,ప్రసాద్,శ్రీహరి ఉన్నారు. ఆలయాల అభివద్ధికి రూ.14 లక్షల మంజూరు బుచ్చిరెడ్డిపాళెం : ఆలయాల అభివృద్ధికి కలెక్టర్ శ్రీకాంత్ నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే నల్లపరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ‘నూస్లైన్’తో మాట్లాడారు. మండలంలోని జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో పైన రేకులు వేయించేందుకు రూ.6 లక్షలు, అన్నదానం వద్ద షెడ్లు వేసేందుకు రూ.4 లక్షలు కేటాయించారన్నారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నం శ్రీచాముండేశ్వరి ఆలయం కో నేరు వద్ద మెట్లు పనులకు రూ.5 లక్షలు కేటాయించారని తెలిపారు. కలెక్టర్ శ్రీకాంత్‌కు ప్రసన్నకుమార్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మూడు వసతి గృహాలు పున:ప్రారంభం విడవలూరు : జిల్లాలో మూడు కళాశాలలకు చెందిన వసతి గృహాలను పునఃప్రారంభించే విధంగా రాష్ట్ర సోషల్ వెల్పేర్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ జిల్లాలోని గూడూరు ప్రభుత్వ డిగ్రీ మహిళా వసతి గృహం, నెల్లూరులోని డీకే మహిళా వసతి గృహాలతో పాటు విడవలూరుకు చెందిన డిగ్రీ, జూనియర్ కళాశాలలకు చెందిన వసతి గృహం కూడా ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ వసతి గృహాల పున:ప్రారంభానికి వైఎస్సార్సీపీ నాయకులు చేసిన కృషి మరువలేనిదన్నారు. జిల్లాలోని మూడు కళాశాలల వసతి గృహాలు పున:ప్రారంభం కానున్న సందర్భంగా సోషల్ వెల్పేర్ కమిషనర్ జయలక్ష్మి, జిల్లా సోషల్ వెల్పేర్ డీడీ విశ్వమోహన్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
జగన్‌కు బెయిల్ రాకుండా బాబు యత్నించారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ రానివ్వకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు జి.శ్రీకాంత్ రెడ్డి, ఎన్. ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ జగన్ చంచల్ గూడ జైలు నుంచి మంగళవారం బెయిల్‌పై విడుదలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో వారు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నిన్నటి వరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని చంద్రబాబు భుజాన మోశారని, అలాంటి ఆయన వైఎస్ జగన్‌కు బెయిల్ రాగనే సీబీఐను దూషించడం మొదలు పెట్టారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకునేలా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులకు శ్రీకాంత్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి సూచించారు. వైఎస్ఆర్ ఎజెండా ప్రకారం సమైక్య రాష్ట్రంగాను ఉండాలని వారు తెలిపారు. తమ పార్టీకి అన్ని ప్రాంతాలు సమానమే అని అన్నారు. ప్రజల సమస్యలపై పోరాడే నాయకుడు కవాలని రాష్ట్రమంతా కోరుకుంటుందని తెలిపారు. కోర్టు అనుమతితో వైఎస్ జగన్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తారన్నారు. -
విజయమ్మ దీక్షకు బాసటగా.. ఐదో రోజుకు ఆమరణ దీక్షలు
కోవూరులో ప్రసన్నకుమార్, కర్నూలులో ఎస్వీ మోహన్‌రెడ్డి, రాయదుర్గంలో భారతి, కడపలో అవినాష్, పుట్టపర్తిలో డాక్టర్ హరికృష్ణ, తాడిపత్రిలో నర్సింహయ్య ఆమరణ దీక్షలు, కదిరిలో ఇస్మాయిల్ నిరశన, జంగారెడ్డిగూడెంలోఆదివిష్ణు ఆమరణ దీక్ష భగ్నం సాక్షి నెట్వర్క్: రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఆ పార్టీ నాయకులు చేపట్టిన ఆమరణ దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరుకున్నాయి. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భార్య కాపు భారతి, తాడిపత్రిలో పార్టీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, పుట్టపర్తిలో పార్టీ నాయకుడు డాక్టర్ హరికృష్ణ, కడప కలెక్టరేట్ ఎదుట వైఎస్ అవినాష్‌రెడ్డి, అంజాద్ బాషా, నాగిరెడ్డి, కర్నూలులో మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షలు గురువారం నాటికి నాలుగురోజులు పూర్తయ్యాయి. జంగారెడ్డిగూడెంలో రాఘవరాజు ఆదివిష్ణు ఆమరణ నిరాహారదీక్షను గురువారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. కదిరిలో పార్టీ సమన్వయకర్త ఎస్ఎండీ ఇస్మాయిల్ రెండోరోజు ఆమరణ దీక్ష కొనసాగించారు. రాయదుర్గంలో ఆమరణ దీక్ష చేస్తున్న కాపు భారతికి అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి సంఘీభావం తెలిపారు. కడప కలెక్టరేట్ ఎదుట దీక్షలకు జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు ఈసీ గంగిరెడ్డి, వైఎస్ కొండారెడ్డి సంఘీభావం తెలిపారు. కర్నూలులో ఎస్వీ మోహన్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబసభ్యులు దీక్షలో కూర్చున్నారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డికి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీతోపాటు సీఈసీ సభ్యులు కాకాణి గోవర్దన్‌రెడ్డి, సూళ్లూరుపేట సమన్వయకర్త నెలవెల సుబ్రమణ్యంలు సంఘీభావం తెలిపారు. కళ్యాణదుర్గంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలకు పార్టీ జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, రాప్తాడులో పార్టీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షలకు పార్టీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మద్దతు తెలిపారు. ఇదిలాఉండగా, విజయమ్మ దీక్షకు మద్దతుగా సీమాంధ్రలోని అన్నిజిల్లాల్లో రిలేదీక్షలు జరుగుతున్నాయి. పారీ నేతలు చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్షలతోపాటు, రిలే దీక్షలకు పెద్దఎత్తున మహిళలు, యువత తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. -
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న ఆమరణ దీక్ష
ఇరు ప్రాంతాలకు న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని విభజించవద్దనే నినాదంతో ఆమరణ దీక్ష చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు మద్దతుగా నెల్లూరు జిల్లా కోవూరులో పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోమవారం నుంచి ఆమరణ దీక్ష ప్రారంభించారు. ప్రసన్నకు మద్దతుగా భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు దీక్షా స్థలానికి తరలి వస్తున్నారు. ఆయనకు మద్దతుగా పార్టీ నాయకుడు డాక్టర్ అనిల్ కుమార్ నేతృత్వంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా చిట్టమూరులో వైఎస్ఆర్సీపీ గూడూరు కన్వీనర్ డాక్టర్ బాలచెన్నయ్య దీక్ష నిర్వహిస్తున్నారు.