
అభినవ కీచకులు ఆ ముగ్గురు
అభినవ కీచకులు ఆ ముగ్గురు
బుచ్చిరెడ్డిపాళెం, :
సోనియాగాంధీ, చంద్రబాబు, బీజేపీ నాయకులు రాష్ట్ర విభజన విషయంలో అభినవ కీచకులుగా మారారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు.
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పి లుపు మేరకు పార్టీ శ్రేణులు పట్టణం లోని వైఎస్సార్ విగ్రహం వద్ద బుధవా రం రాస్తారోకో నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్లమెంట్‌లో మంగళవారం టీబిల్లును ప్ర వేశపెట్టడం నర్తనశాలను తలపించిందన్నారు. రెండు ప్రాంతాల్లో రాజకీయం గా పార్టీ ఎదుగుదలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇరు ప్రాంతాల నాయకులను రెచ్చగొట్టారన్నారు.
త మ నాయకుడి వల్లే తెలంగాణ వచ్చిం దని టీడీపీ తెలంగాణ నేతలు నామా నాగేశ్వరరావు, యర్రబల్లి దయాకర్‌రా వు చెప్పడం దీనికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు రాజకీయ వ్యభిచారులుగా మారాయని దుయ్యబ ట్టారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేసేం దుకు సోనియా, రెండు ప్రాంతాల్లో పా ర్టీ ఎదుగుదలకు చంద్రబాబు రాష్ట్ర విభజనకు కారకులయ్యారన్నారు.
తొలి నుంచి సమైక్యాంధ్ర కోసం పోరాడిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే స మైక్యవాదిగా మిగిలారన్నారు. జొన్నల గడ్డ నారాయణరావు, కోడూరు మధుసూదన్‌రెడ్డి, యామాల మోహన్, కత్తి శేషయ్య, పిడుగు మధు, మల్లు జయరామిరెడ్డి, నెల్లూరు నాగేశ్వరరావు, చెల్లాయపాళెం, ఉప సర్పంచ్ మురళీ, నాగాయగుంట సర్పంచ్ రాజశేఖర్, వెంకట్రావు, చిన్న అల్లాబక్షు, తాజుద్దీన్, మున్నా పాల్గొన్నారు.
సీఎం రాజీనామా చేసి ఏం లాభం
సీడబ్ల్యూసీ తీర్మానం చేసినపుడే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసి ఉం డాల్సిందని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంట్‌లో టీ బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాజీనామా చేసి ఏం ఉపయోగమని ఆయన ప్రశ్నిం చారు. కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి, పార్టీ నే తలు మేనకూరు సీతారామిరెడ్డి, కలువ బాలశంకర్‌రెడ్డి, గుమ్మా సుధాకరయ్య, షేక్ కరీముల్లా(బాబు), జబీవుల్లా, ఫ యాజ్‌బాషా, అహ్మద్‌బాషా, గుమ్మా సు దాకరయ్య, నాగేశ్వరరావు, బొంతా హరిబాబుయాదవ్ పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన దారుణం
ఇందుకూరుపేట: సీమాంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని వి భజించడం దారుణమని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మం డలంలో బుధవారం బంద్ నిర్వహిం చారు. ఆరోమైలు కూడలిలో రాస్తారో కో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తీరు అప్రజాస్వామికమన్నారు. దుర్మార్గంగా రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. నాయకులు వెంకటకృష్ణారెడ్డి, వెంకటరమణారెడ్డి, కుమార్‌రెడ్డి, నారాయణరెడ్డి, కృష్ణప్రసాద్, మల్లికార్జునరెడ్డి, బాబయ్య, కృష్ణ, మహి, ఉమ, రవి, సర్పంచ్‌లు బాలబొమ్మ వెంకటేశ్వర్లు, గూడూరు జయరామయ్య, తాతా సురేంద్ర పాల్గొన్నారు. అలాగే జీ ఎస్సార్ యువసేన ఆధ్వర్యంలో ఇందుకూరుపేట, కొత్తూరు గ్రామాల్లో దుకాణలు, పాఠశాలలు, బ్యాంకులు, ప్రభు త్వ కార్యాలయాలను మూసివేయించా రు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. గురజాల జ్ఞానస్వరూప్, సూదలగుంట వెంకటేశ్వరనాయుడు, భాస్కర్‌నాయుడు, గోళ్ల రవీంద్రరావు, శ్రీకాంత్‌రెడ్డి, చక్రి, ఉపసర్పంచ్ వెంకట ప్రసాద్ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాస్తారోకో
కోవూరు: రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సాయిబాబా గుడి సమీపంలో జాతీయరహదారిపై బైఠాయిం చి వాహనాల రాకపోకలను అడ్డుకున్నా రు. దీంతో సుమారు 8 కిలోమీటర్ల మే ర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీమాం ధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభజించడం దారుణమన్నారు. సోనియాగాంధీ నియంతలా వ్యవహరించి లోక్‌సభలో బిల్లును ఆ మోదింపజేయడం దుర్మార్గమన్నారు. పదవుల కోసం పాకులాడే సీమాంధ్ర నే తలు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. నాటి బ్రిటిష్ పాలకులు ఇండియా నుంచి పాకిస్తాన్‌ను విభజిస్తే ప్రస్తుతం ఇటలీ నియంత సోనియాగాంధీ రాష్ట్ర విభజనకు పాల్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో ములమూడి వినోద్‌రెడ్డి, రా ధాకృష్ణారెడ్డి, సర్పంచ్ కూట్ల ఉమ, ఉపసర్పంచ్ మల్లారెడ్డి, నిరంజన్‌బాబురె డ్డి, మల్లికార్జున్‌రెడ్డి, నరసింహులురెడ్డి, అట్లూరి సుబ్రహ్మణ్యం, మంచి శ్రీనివాసులు,డాక్టర్ శీనయ్య, సీతారామిరెడ్డి, మారం వినయ్‌కుమార్‌రెడ్డి, జనార్దన్‌రె డ్డి,శ్రీనివాసులురెడ్డి, బాబురె డ్డి,సుబ్బారెడ్డి,ఉయ్యూరువేణు ఉన్నారు.
లేగుంటపాడులో...
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మండలంలోని లేగుంటపాడులో వైఎస్సార్‌సీ పీ నాయకులు నిరసన తెలిపారు. ఇనమడుగు-ముదివర్తి రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మారం వినయ్‌కుమార్‌రెడ్డి, సాయిరెడ్డి, మనోజ్, సూర్యారెడ్డి, రాజా ,వంశీనాయుడు, మోహన్‌సాయినాయుడు, సందీప్, మనోజ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
బిల్లు ఆమోదం అప్రజాస్వామికం
విడవలూరు: పార్లమెంట్‌లో టీ బిల్లు ఆ మోదించిన తీరును చూస్తే సామాన్య మానవునికి కూడా అసలు ప్రజాస్వామ్యం ఉందా అనే ప్రశ్న తలెత్తుతుందని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ విడవలూరులో వైఎస్సార్‌సీపీ నాయకు లు చేపట్టిన బంద్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభజించడం దారుణమన్నారు. చెన్నారెడ్డి హయాంలో పెద్దఎత్తున తెలంగా ణ ఉద్యమం నడిచినా రాష్ట్ర విభజన మంచిదికాదని ఇందిరాగాంధీ స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు. ఆమె కోడలు సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజిం చ డం దారుణమన్నారు. సమైక్యాంధ్ర కో సం వైఎస్సార్‌సీపీ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోని అన్ని ప్రాంతాల నాయకులను కలుసుకుని పోరాడినట్లు గుర్తుచేశారు. పార్టీ మండల కన్వినర్ బె జవాడ గోవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర యువజన వి భాగం సభ్యుడు ఓగు నాగేశ్వరరావు, నాయకులు కొండూరు వెంటకసుబ్బారె డ్డి, వీరిచలపతిరావు, మాతూరు శ్రీని వాసులరెడ్డి, అనపల్లి ఉదయ్‌భాస్కర్, నిరంజన్‌బాబురెడ్డి, పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ బంద్ విజయవంతం
కొడవలూరు: రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు మం డలంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఆ ద్వర్యంలో నార్తురాజుపాళెంలో జాతీ య రహదారిపైకి చేరుకుని వాహనాలను నిలిపి వేశారు. దీంతో సుమారు పది కిలో మీటర్ల దూరం వాహనాలు బారులు తీరి నిలిచిపోవడంతో రాకపోకలు స్తంభించాయి.జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వీరి చలపతిరావు, నల్లావుల శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ పిట్టి సూరి, మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, నాయకులు పెనాక శ్రీనివాసులురెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, నందకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.