నాలుగు రాష్ట్రాల ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ పార్టీకీ మైండ్‌బ్లాక్ అయిందని, ఇక ఆ పార్టీ పని ఖతమేనని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు.
కోవూరు, న్యూస్‌లైన్ : నాలుగు రాష్ట్రాల ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ పార్టీకీ మైండ్‌బ్లాక్ అయిందని, ఇక ఆ పార్టీ పని ఖతమేనని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని పడుగుపాడు ఇనమడుగు సెంటర్లో సోమవారం ఆయన ఓ సిమెంటు, స్టీలు దుకాణాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెత్తు పోకడలతో ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించారన్నారు. 2014లో ఎన్నికల అనంతరం సోనియాగాంధీ ఇటలీకి మకాం మార్చాల్సిందేనని ప్రస న్న జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మకుటంలేని మహరాజుగా 30 ఏళ్ల పాటు సీఎంగా ఏకఛత్రాధిపతిగా పరిపాలన చేస్తారన్న ధీమా వ్యక్తం చేశారు.
అన్ని వర్గాల వారికి అండగా ఉంటూ ఏ సమస్య వచ్చినా తానున్నాననే భరోసా ఇస్తూ ఆదుకుంటారని తెలిపారు. 2014 సాధారణ ఎన్నికల్లో 175 అసెంబ్లీ , 25 పార్లమెంటు స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవశం చేసుకోవడం తథ్యమన్నారు. ఢిల్లీలో వైఎస్ జగన్ చక్రం తిప్పడం ఖాయమన్నారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ములుముడి వినోద్‌రెడ్డి, జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, నిరంజన్‌బాబురెడ్డి, రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, ములుముడి సుబ్బరామిరెడ్డి, మోడెం శ్రీనివాసులురెడ్డి, అట్లూరి సుబ్రహ్మణ్యం, అన్నూ, చేజర్ల సీతారామిరెడ్డి, శ్రీనివాసులు, నారాయణ,ప్రసాద్,శ్రీహరి ఉన్నారు.
ఆలయాల అభివద్ధికి
రూ.14 లక్షల మంజూరు
బుచ్చిరెడ్డిపాళెం : ఆలయాల అభివృద్ధికి కలెక్టర్ శ్రీకాంత్ నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే నల్లపరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ‘నూస్‌లైన్’తో మాట్లాడారు. మండలంలోని జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో పైన రేకులు వేయించేందుకు రూ.6 లక్షలు, అన్నదానం వద్ద షెడ్లు వేసేందుకు రూ.4 లక్షలు కేటాయించారన్నారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నం శ్రీచాముండేశ్వరి ఆలయం కో నేరు వద్ద మెట్లు పనులకు రూ.5 లక్షలు కేటాయించారని తెలిపారు. కలెక్టర్ శ్రీకాంత్‌కు ప్రసన్నకుమార్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
మూడు వసతి గృహాలు పున:ప్రారంభం
విడవలూరు : జిల్లాలో మూడు కళాశాలలకు చెందిన వసతి గృహాలను పునఃప్రారంభించే విధంగా రాష్ట్ర సోషల్ వెల్పేర్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ జిల్లాలోని గూడూరు ప్రభుత్వ డిగ్రీ మహిళా వసతి గృహం, నెల్లూరులోని డీకే మహిళా వసతి గృహాలతో పాటు విడవలూరుకు చెందిన డిగ్రీ, జూనియర్ కళాశాలలకు చెందిన వసతి గృహం కూడా ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ వసతి గృహాల పున:ప్రారంభానికి వైఎస్సార్‌సీపీ నాయకులు చేసిన కృషి మరువలేనిదన్నారు. జిల్లాలోని మూడు కళాశాలల వసతి గృహాలు పున:ప్రారంభం కానున్న సందర్భంగా సోషల్ వెల్పేర్ కమిషనర్ జయలక్ష్మి, జిల్లా సోషల్ వెల్పేర్ డీడీ విశ్వమోహన్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.