
అమరావతి: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన నివాసంలో మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం అందించిన గొప్ప నాయకుడు మహాత్మాగాంధీ ఆయన ట్విటర్‌లో స్మరించుకున్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన బోధనలైన అహింస, సత్యాగ్రహం, సర్వోదయ కోసం పునరంకితమవుదామని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. అదేవిధంగా దేశకోసం ప్రాణాలర్పించిన అమరులకు ఆయన నివాళులర్పించారు.
Remembering the great leader who guided our Nation towards the path of freedom. On Bapuji's vardhanti, let us rededicate ourselves towards his teachings of Ahimsa, Satyagraha & Sarvodaya. Tributes to the brave #martyrs who have laid their lives for our Nation.#MahatmaGandhi
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 30, 2020
రాజ్‌ఘాట్ వద్ద ఘననివాళులు
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ గాంధీ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. శాంతి, అహింసలే ఆయుధాలుగా మహాత్మాగాంధీ పోరాటం చేశారని మన్మోహన్ అన్నారు. గాంధీని హత్యకు విద్వేషమే నేడు వర్ధిల్లుతోందని కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విమర్శనాస్త్రలు ఎక్కుపెట్టింది.