మాట్లాడుతున్న ప్రసన్నకుమార్‌రెడ్డి
కోవూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు మోసగించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. కోవూరులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా పార్టీ ఎంపీలు ఢిల్లీ లో ఆమరణ దీక్ష చేస్తున్నారని చెప్పారు. వీరికి మద్దతుగా పార్టీ పిలుపు మేరకు కోవూరులో రిలే దీక్షలు జరుగుతున్నాయన్నారు.
వెంకయ్యనాయుడు తలుచుకుంటే ప్రధాని మోదీతో మాట్లాడి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని, అయితే మీనమేషాలను ఎందుకు లెక్కిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. విశ్వసనీయత కు జగన్‌మోహన్‌రెడ్డి నిదర్శనమన్నారు. ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తోంది జగన్‌మోహన్‌రెడ్డేనని చెప్పారు. చంద్రబాబు ఢిల్లీలోని టీడీపీ ఎంపీలకు ఫోన్ చేసి నాటకాల కా ర్యక్రమం ముగిసిపోయిందని, ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభిస్తామని.. అమరావతికి రమ్మని చెప్పారని విమర్శించారు.
లోకేష్, బాబుకు మతిభ్రమించింది
ప్రత్యేక హోదా వచ్చేంత వరకూ ప్రజల మధ్యలో ఉండి పోరాటాలు చేస్తామని మంత్రి లోకేష్ చెప్పారని, ముందు టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించి ప్రజల్లోకి రావాలని సూచించారు. చంద్రబాబు మంచితనం, మానవత్వాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని లోకేష్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబుకు వెన్నుపోట్లు, అబద్దాలు, మోసం, అవినీతి, అక్రమాలు, వంచించడం వెన్నెతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మంత్రి కొల్లు రవీంద్ర, కాలువ శ్రీనివాసులు జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. మోదీతో తాము లాలూచీ పడి ఉంటే రాజీనామాలు చేయకుండానే ఉండవచ్చన్నారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని భయపడి నరేంద్రమోదీ కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకుంటున్నారని విమర్శించారు.
ఒక పక్క ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్నామంటూనే మరో వైపు మంత్రులను మోదీ వద్దకు పంపి కాలం వెళ్లదీస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగేళ్లలో ప్రజల రక్తం తాగి టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కొవ్వుపట్టి ఉందన్నారు. 70 ఏళ్లు దాటిన ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్ వయోభారాన్ని లెక్కచేయకుండా ప్రజల శ్రేయస్సు కోసం ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యల కోసం పోరాడేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా విషయంలో చంద్రబా బు డ్రామాలను పక్కనబెట్టి ప్రజల వద్దకు రావాలని హితవు పలికారు. నిరంజన్‌బాబురెడ్డి, రాధాకృష్ణారెడ్డి, శ్రీని వాసులురెడ్డి, మల్లికార్జునరెడ్డి, నరసింహులురెడ్డి, జనార్దన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment