జైట్లీ, వెంకయ్య అబద్ధాలు చెప్పారు | botsa satyanarayana takes on chandra babu, arun jaitley, venkaiah naidu | Sakshi
Sakshi News home page

జైట్లీ, వెంకయ్య అబద్ధాలు చెప్పారు

Published Sat, Oct 29 2016 4:24 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

జైట్లీ, వెంకయ్య అబద్ధాలు చెప్పారు - Sakshi

జైట్లీ, వెంకయ్య అబద్ధాలు చెప్పారు

హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు అబద్ధాలు చెప్పారని వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పరిపాలన నగరం, రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అరుణ్ జైట్లీ, వెంకయ్యలను పొగడడానికే చంద్రబాబు సమయం వెచ్చించారని, రాష్ట్ర ప్రయోజనాలను ప్రస్తావించలేదని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ కంటే చిన్న రాష్ట్రాలకు ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్శిటీలను ఇస్తున్నారని బొత్స పేర్కొన్నారు. ఏపీకి 2 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నామని జైట్లీ చెప్పారని, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను ప్రాతిపదికగా తీసుకునే ఇస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు కొత్తగా ఇచ్చిందేమిటని, ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారని, సీఎంగా ఉంటూ చంద్రబాబు జైట్లీని ఎందుకు ప్రశ్నించలేదని బొత్స నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులుకారని, అన్ని విషయాలను గమనిస్తున్నారని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement