వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు మద్దతుగా నెల్లూరు జిల్లా కోవూరులో పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆమరణ దీక్ష ప్రారంభించారు.
ఇరు ప్రాంతాలకు న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని విభజించవద్దనే నినాదంతో ఆమరణ దీక్ష చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు మద్దతుగా నెల్లూరు జిల్లా కోవూరులో పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోమవారం నుంచి ఆమరణ దీక్ష ప్రారంభించారు.
ప్రసన్నకు మద్దతుగా భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు దీక్షా స్థలానికి తరలి వస్తున్నారు. ఆయనకు మద్దతుగా పార్టీ నాయకుడు డాక్టర్ అనిల్ కుమార్ నేతృత్వంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా చిట్టమూరులో వైఎస్‌ఆర్‌సీపీ గూడూరు కన్వీనర్ డాక్టర్ బాలచెన్నయ్య దీక్ష నిర్వహిస్తున్నారు.