- బాంబులుగా అనుమానించి రైళ్లు నిలిపివేత
- విశాఖ స్టేషన్లో అర్ధరాత్రి ముమ్మర తనిఖీలు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ప్రశాంతమైన విశాఖ రైల్వే స్టేషన్‌లో అర్ధరాత్రి కలకలం రేగింది. మంగళవారం రాత్రి 11.30 నుంచి 1.30 గంటల వరకూ రైల్వే ఉద్యోగులను పరుగులు పెట్టిం చింది. వం దలాది మంది ప్రయాణికులను ఆందోళనకు గు రి చేసింది. ఓ వ్యక్తి వద్ద బాంబులున్నాయంటూ రేగిన కలకలం దావానంలా వ్యాపించి రైల్వే, ఆర్పీఎఫ్, నగరపోలీస్, నేవల్ అధికారుల్లో అల జడి రేపింది. ఉన్నతాధికారులను అప్రమత్తం చేసింది. 11.30 గంటలకు రైలు బయల్దేరాల్సిన వే ళలో ప్రయాణికులంతా ఒక్క ఉదుటన దిగేశా రు.
ఎవరిని అడిగినా బాంబు ఉందట అనే మా టతోనే అంతా పరుగులంకించుకున్నారు. ఓ బోగీ వద్ద ప్లాట్‌ఫారంపై పోలీసులు పెద్ద ఎత్తు న గుమిగూడడంతో అక్కడే బాంబు ఉందంటూ వ దంతులు వ్యాపించాయి. అంతే అంతా పరుగులు.. ఆర్పీఎఫ్ బూటు చప్పళ్లతో విశాఖ రైల్వే స్టేషన్ మార్మోగిపోయింది. మంగళవారం అర్ధరాత్రి విశా ఖ నుంచి ఎల్‌టీటీ వెళ్లాల్సిన లోకమాన్య తిలక్ టెర్మినస్(ఎల్‌టీటీ) ఎక్స్‌ప్రెస్ వద్ద ఈ సంఘటన జరిగింది.
పోలీసు అధికారులంతా సంఘటన స్థలానికి చేరుకుని ఆ బాంబులున్న వ్యక్తి నేవల్‌లో అధికారిగా నిర్ధారించుకుని ఆర్పీఎఫ్ స్టేషన్‌కు తీసుకుపోయారు. రైలుకు ప చ్చజెండా ఊపేశారు. ఈ రైలు కోసం మూడు నాలుగు రైళ్లు బయల్దేరకుండా ఆగిపోయాయి. విష యం ఏంటంటే హైదరాబాద్ నేవల్ కెనాల్‌లో విష్ణుకుమార్ అరియార్ అనే బీహార్ వ్యక్తి అధికారిగా పనిచేస్తున్నా రు.
ఇటీవల ఆయన విశాఖ నేవల్ డాక్‌యార్డ్‌లో డాగ్‌స్క్వాడ్‌కు శిక్షణిచ్చేందుకు వచ్చారు. తిరిగి లోకమాన్యతిలక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్ర యాణమయ్యేందుకు మంగళవారం రాత్రి విశాఖ స్టేషన్‌కు వచ్చారు. అరియార్ ప్రవర్తన, మాటతీరు, భాష కాస్త డిఫరెంట్ గా ఉండడంతో ఆయన బాంబు పెట్టేందుకే వచ్చి ఉంటాడని అంతా కేకలు పెట్టారు.
పోలీసుల తనిఖీల్లో కూడా పేలుడు పదార్థాలు, బాంబులను నిర్వీర్యం చేసే కొన్ని పరికరాలు, బాం బులను అమర్చేందుకు ఏర్పాటు చేసే సామగ్రి అంతా ఉండడంతో పోలీసులు కూడా అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. వాస్తవంగా ఆయన వద్ద ఓ స్నైపర్ డాగ్, రెండు శాంపి ల్స్ ఉన్న పేలుడు పదార్ధాల పెట్టె వుంది. రాత్రంగా ఆయన వద్ద ఉన్న గుర్తింపు కార్డులు చూసి వివరాలు అడిగి తెలుసుకుని నేవల్ పోలీసులతో నిర్ధారించుకున్న తర్వాత ఆయనను విడచిపెట్టారు.