తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు సింగిరెడ్డి పరమేశ్వర్ మాదిగ అన్నారు.
కొడంగల్, న్యూస్‌లైన్: తెలంగాణ అమరవీరుల కు టుంబ సభ్యులకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు సింగిరెడ్డి పరమేశ్వర్ మాదిగ అన్నారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అ తిథి గృహంలో ‘అమరుల తల్లుల కడుపుకోత మహా సభ’ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో భా గంగా 1100 మంది ఆత్మబలిదానం చేసుకున్నారని, వారి కుటుంబాలకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఈనెల 10న హైద్రాబాద్‌లోని నిజాం కళాశాల గ్రౌండ్‌లో భారీ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలోని అన్ని గ్రామాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో హాజరు కా వాలని కోరారు. కాసుబ్రహ్మానందరెడ్డి పార్కు ను తెలంగాణా అమరుల పార్కుగా ప్రకటిం చి స్మారక విగ్రహాలు, మ్యూజియం ఏర్పాటు చేయాలని, నెక్లెస్‌రోడ్డులో అమరుల స్మారక స్తూపాన్ని నిర్మించాలన్నారు. అమరుల కుటుంబాల్లో ఒకరికీ ప్రభుత్వ ఉద్యోగం, రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా, 5 ఎకరాల భూమి, అమరుల తల్లిదండ్రులకు నెలకు రూ. 5 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు జంగయ్యమాదిగ, రాములు, సోమశేఖర్, కృష్ణం రాజు, చంద్రప్ప, శేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.