రాష్ట్రంలో కొత్తగా ఏసీబీ కోర్టులు
అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 4 ప్రత్యేక ఏసీబీ న్యాయస్థానాలు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, కర్నూలులో నూతనంగా నాలుగు కోర్టుల ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. హైకోర్టు సూచనల మేరకు నాలుగు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేస్తున్నామని వీటి ద్వారా కేసులు త్వరితగతిన విచారణ జరిగే అవకాశం ఉంటుందని ఉత్తర్వులలో పేర్కొంది.