శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ఇంటర్మీడి యెట్ విద్యార్థులకు కొత్త ప్రయోగ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. గత ఏడాది వరకు సీనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థులకు జీవుల శరీర నిర్మాణం, అవయవాలపై అవగాహన కల్పించేందుకు డిసెక్షన్ పేరిట కప్ప, బొద్దింక, వానపాము వంటి జీవులను కోసి ప్రయోగ పరీక్షలు చేయించేవారు. ఈ ఏడాది దీన్ని రద్దు చేశారు. దీని స్థానంలో అవయవాల, అం తర్ భాగాల బొమ్మలు, చార్టులు, కంప్యూట ర్ ద్వారా అవగాహన కల్పిస్తారు.
2014లో జరిగే ప్రయోగ(ప్రాక్టికల్స్) పరీక్షల్లో కూడా కోత విధానాన్ని రద్దు చేస్తూ ఇంటర్ బోర్డు ఇటీవలే నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తం గా డిసెక్షన్ విధానం అమలుకు ఏటా లక్షలాది కప్పలు, బొద్దింకలు, వానపాములను చంపాల్సి వస్తోంది. దీనివల్ల రైతులకు మేలు చేసే వానపామలు అంతరించిపోతున్నాయి. అలాగే నీటి వనరుల్లో క్రిమికీటకాలు తిని కాలుష్యాన్ని తగ్గించే కప్పలు కూడా అంతరించిపోయే పరిస్థితి ఏర్పడుతోందని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదివరలో జంతు శాస్త్రంలో చిత్రపటానికి ఐదు మార్కులు, డిసెక్షన్‌కు ఐదు మార్కులు ఉం డేవి. ఇప్పుడు డిసెక్షన్‌ను రద్దు చేయడంతో ఒక ప్రశ్నకు సమాధానం, చిత్రపటానికి కలిపి ఆరు మార్కులు కేటాయించాలని నిర్ణయించారు.
రసాయన, వృక్ష శాస్త్ర పరీక్షల్లోనూ మార్పులు తీసుకువచ్చారు. ఇప్పుడు రికార్డులతో పాటు, ప్రాజెక్టు వర్క్‌ను తప్పనిసరి చేశారు. దీనిపై శ్రీకాకుళం డీవీఈఓ పాపారావు మాట్లాడుతూ ఇంటర్ రెండో సంవత్సరం ప్రయోగ పరీక్షల విధానాన్ని మార్చడం వాస్తవమేనన్నారు. జంతు శాస్త్రం డిసెక్షన్ విధానాన్ని తీసివేయగా, వృక్షశాస్త్రంలో కొన్ని రకాల మొక్కలపై ప్రయోగాలను నిలిపివేశారన్నారు. రసాయన శాస్త్రం లో రెండు లవణాలు అదనంగా వచ్చి చేరాయని చెప్పారు. భౌతిక శాస్త్రంలో కూడా కొత్తగా ఆరు ప్రయోగాలు వచ్చాయని తెలిపారు. ఈ ఏడాది నుంచి ప్రాజెక్టు వర్క్ కూడా తప్పనిసరి అన్నారు.
సీనియర్ ఇంటర్‌లో కొత్త ‘ప్రయోగం’
Published Wed, Nov 20 2013 4:01 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
Advertisement
Advertisement