new experiment
-
బ్లూ దోస వీడియో వైరల్: నెటిజన్లు మాత్రం..!
Blue Pea Dosa దక్షిణ భారత వంటకాలు అందులోనూ దోస అంటే నోరు ఊరనిది ఎవరికి. పళ్లు లేని వారుకూడా నమల గలిగేలా మెత్తగా దూదపింజ లాంటి దోస మొదలు కర కరలాడే దోస, మసాలా దోస, ఉల్లి దోస, చీజ్ కార్న్ దోస అబ్బో ఈ లిస్ట్ పెద్దదే. ఇక దీనికి సాంబారు తోడైతే ఇక చెప్పేదేముంది. అంత క్రేజ్ దోస అంటే. తాజాగా కొత్త రకం దోసం ఒకటి వైరల్‌గా మారింది. శంఖు పుష్పాలు, లేదా అపరాజిత పూలతో ఇలాంటి ప్రయోగాలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. గతంలో బ్లూ రైస్ వీడియోకూడా వార్తల్లో నిలిచింది. ఇపుడు బ్లూ పీ దోస అన్నమాట. జ్యోతీస్ కిచెన్ అనే ఇన్స్టాగ్రామ్ రీల్లో బ్లూ పీ దోస ఇపుడు నట్టింట వైరల్‌గా మారింది. నీలి రంగు అపరాజిత పూలను ఉడికించిన నీళ్లలో దోస పిండి కలిపి దోస తయారీ అవుతోంది. ముఖ్యంగా చక్కటి నీలి రంగులో నోరూరించే దోస రడీ కావడం విశేషంగా నిలిచింది. ఇప్పటి 10 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ దోస వీడియోపై Instagram యూజర్లు మిశ్రమంగా స్పందించారు. వావ్ చాలా అద్భుతంగా ఉంది.. బ్యూటిఫుల్ కలర్ అని కొంతమంది కమెంట్ చేశారు. అవును.. శంఖు పూలు ఎడిబుల్.. ఈ పూలతో చేసిన టీ చాలా బావుంటుంది అంటూ ఒక యూజర్ కమెంట్ చేశారు. మరికొంతమంది మాత్రం అరే ఎందుకురా..అందమైన దోసను ఇలా పాడు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కొంతమందయితే విచిత్రమైన దోసలతో పాపులరైన మరోఫుడ్ బ్లాగర్కి ట్యాగ్ చేశారు. రివ్యూ చే బ్రో... ఎక్కడున్నావ్..లాంటి ఫన్నీ కామెంట్లు కూడా ఉన్నాయి. View this post on Instagram A post shared by jyotiz kitchen (@jyotiz_kitchen) -
ఇక వ్యాపారంలో వర్మ విప్లవం
మొన్న ‘ఐస్‌క్రీమ్’తో సరికొత్త చిత్ర నిర్మాణ పద్ధతికి శ్రీకారం చుట్టిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మఇప్పుడు హీరో మంచు విష్ణుతో కలసి సినిమా అమ్మకాల విషయంలో కొత్త ప్రయోగం చేస్తున్నారు. మధ్యవర్తులు ఎవరూ లేకుండానే, ఇంటర్నెట్ వాడుతూ, సినీ వ్యాపారం మీద ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే తమ సినిమాను కొనుగోలు చేసేందుకు వీలుగా ‘ఫిల్మ్ ఆక్షన్ డాట్ ఇన్’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఆగస్టు 15న తమ కాంబినేషన్లో విడుదల కానున్న కొత్త సినిమా (టైటిల్ ప్రకటించలేదు)తో ఈ వినూత్న పద్ధతిని మొదలుపెడుతున్నట్లు మంగళవారం సాయంత్రం వర్మ, విష్ణు ప్రకటించారు. ‘‘ఆ సైట్లో ఫలానా హాలుకి మా సినిమా కొనాలంటే రేటు ఇంత అని నేరుగా పెట్టేస్తాం. ఎవరైనా ఆ రేటుకు, ఆ హాలు వరకు సినిమా కొనుక్కోవచ్చు’’ అని వర్మ ప్రకటించారు. ‘‘నియమ నిబంధనలన్నీ ఆగస్టు ఒకటి నుంచి సైట్లో ఉంటాయి. అంతా పారదర్శకమే. ఇప్పటి దాకా కొద్దిమందే డిస్ట్రిబ్యూటర్లున్నారు. ఈ వినూత్న విధానంతో వచ్చే కొత్తవాళ్ళతో కొన్ని వేలమంది తయారవుతారు’’ అని వర్మ అభిప్రాయపడ్డారు. హీరో విష్ణు మాట్లాడుతూ, ‘‘ఇప్పటి దాకా తెలుగునాట 300 హాళ్ళతో ఇలా సినిమాల కొనుగోలు, విడుదలకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఒకవేళ కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోతే, మా సినిమా మేమే విడుదల చేసుకుంటాం. ఇక్కడ బుద్ధిబలం వర్మది. భుజబలం నాది’’ అని చెప్పారు. ‘‘దేశంలోనే తొలిసారిగా ఈ రకమైన ఆలోచన చేస్తున్నాం. నలుగురు స్టూడెంట్లు కలిసి కూడా ఒక సినిమాను కొనుక్కొనేందుకు వీలు కల్పించే ఈ ప్రతిపాదన వల్ల సినిమాపై వ్యాపారం పెరుగుతుంది. ఇలా సినిమా పంపిణీ, కొనుగోలు వ్యవస్థను మొత్తాన్నీ సమూలంగా మార్చాలని భావిస్తున్నా’’ అని వర్మ వివరించారు. కేవలం తమ సినిమాకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో ఎవరైనా వేరే దర్శక, నిర్మాతలు తమను సంప్రతిస్తే, వారి చిత్రాలకూ తమ ‘ఫిల్మ్ ఆక్షన్ డాట్ ఇన్’ వెబ్సైట్ ద్వారా ఈ పద్ధతిలో సహకరిస్తామని వర్మ, విష్ణు ప్రకటించారు. ఇలాంటి ఐడియా రావడం గ్రేట్ అని డిస్ట్రిబ్యూటర్లు సైతం అభినందించినట్లు వర్మ తెలిపారు. ‘ఐస్‌క్రీమ్’ చిత్ర నిర్మాణం విషయంలో తనపై వచ్చిన విమర్శల్ని వర్మ ప్రస్తావిస్తూ, ‘‘ఎవరేమన్నా నా పద్ధతి నాది. బొమ్మ కనబడుతోందా, సౌండ్ వినబడుతోందా అనేదే నా లెక్క. అంతేతప్ప, సినిమా ఎలా, ఏ కెమేరాతో తీశామన్నది ముఖ్యం కాదు. ఇక నుంచి టైటిల్స్‌లో కూడా టెక్నికల్ డెరైక్టర్, క్రియేటివ్ డెరైక్టర్ అనే రెండే పేర్లు వేయాలనుకుంటున్నా’’ అని మరో సంచలనాత్మక ప్రకటన చేశారు. సినీ వ్యాపారంలో నూతన విప్లవానికి శ్రీకారం చుడుతున్న వర్మ ఏ మేరకు విజయం సాధిస్తారో, ఎంతమంది దీన్ని స్వాగతిస్తారో వేచి చూడాలి. -
సీనియర్ ఇంటర్లో కొత్త ‘ప్రయోగం’
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ఇంటర్మీడి యెట్ విద్యార్థులకు కొత్త ప్రయోగ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. గత ఏడాది వరకు సీనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థులకు జీవుల శరీర నిర్మాణం, అవయవాలపై అవగాహన కల్పించేందుకు డిసెక్షన్ పేరిట కప్ప, బొద్దింక, వానపాము వంటి జీవులను కోసి ప్రయోగ పరీక్షలు చేయించేవారు. ఈ ఏడాది దీన్ని రద్దు చేశారు. దీని స్థానంలో అవయవాల, అం తర్ భాగాల బొమ్మలు, చార్టులు, కంప్యూట ర్ ద్వారా అవగాహన కల్పిస్తారు. 2014లో జరిగే ప్రయోగ(ప్రాక్టికల్స్) పరీక్షల్లో కూడా కోత విధానాన్ని రద్దు చేస్తూ ఇంటర్ బోర్డు ఇటీవలే నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తం గా డిసెక్షన్ విధానం అమలుకు ఏటా లక్షలాది కప్పలు, బొద్దింకలు, వానపాములను చంపాల్సి వస్తోంది. దీనివల్ల రైతులకు మేలు చేసే వానపామలు అంతరించిపోతున్నాయి. అలాగే నీటి వనరుల్లో క్రిమికీటకాలు తిని కాలుష్యాన్ని తగ్గించే కప్పలు కూడా అంతరించిపోయే పరిస్థితి ఏర్పడుతోందని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదివరలో జంతు శాస్త్రంలో చిత్రపటానికి ఐదు మార్కులు, డిసెక్షన్‌కు ఐదు మార్కులు ఉం డేవి. ఇప్పుడు డిసెక్షన్ను రద్దు చేయడంతో ఒక ప్రశ్నకు సమాధానం, చిత్రపటానికి కలిపి ఆరు మార్కులు కేటాయించాలని నిర్ణయించారు. రసాయన, వృక్ష శాస్త్ర పరీక్షల్లోనూ మార్పులు తీసుకువచ్చారు. ఇప్పుడు రికార్డులతో పాటు, ప్రాజెక్టు వర్క్‌ను తప్పనిసరి చేశారు. దీనిపై శ్రీకాకుళం డీవీఈఓ పాపారావు మాట్లాడుతూ ఇంటర్ రెండో సంవత్సరం ప్రయోగ పరీక్షల విధానాన్ని మార్చడం వాస్తవమేనన్నారు. జంతు శాస్త్రం డిసెక్షన్ విధానాన్ని తీసివేయగా, వృక్షశాస్త్రంలో కొన్ని రకాల మొక్కలపై ప్రయోగాలను నిలిపివేశారన్నారు. రసాయన శాస్త్రం లో రెండు లవణాలు అదనంగా వచ్చి చేరాయని చెప్పారు. భౌతిక శాస్త్రంలో కూడా కొత్తగా ఆరు ప్రయోగాలు వచ్చాయని తెలిపారు. ఈ ఏడాది నుంచి ప్రాజెక్టు వర్క్ కూడా తప్పనిసరి అన్నారు.