
పైనాపిల్‌ను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు
సీతంపేట: నూతన పైనాపిల్ రకాలను ప్రవేశపెట్టాలని ఒడిశాకు చెందిన సెంట్రల్ హార్టీకల్చర్ ఎక్స్‌పరిమెంటల్ స్టేషన్ శాస్త్రవేత్త నందకుమార్ సూచించారు. మండలంలోని ముత్యాలు, లంగడుగూడ, సంతమల్లి గ్రామాల్లోని పైనాపిల్ పంటలను శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతంపేట ఏజెన్సీలో పండిస్తున్న సింహాచలం రకానికి చెందిన పైనాపిల్ స్థానంలో క్యూ, క్వీన్ లేదా ఎండీ2 టిష్యూ కల్చర్ రకానికి చెందిన పైనాపిల్‌ను పండిస్తే అధిక దిగుబడి వస్తుందన్నారు. దీని ధర కూడా సుమారు రూ.50 నుంచి 60 వరకు ఉంటుందన్నారు.
రెండు మొక్కల మధ్య మూడు అడుగుల దూరం ఉండేలా చూడాలన్నారు. అనంతరం ఐటీడీఏ పీవో శివశంకర్‌ను కలిసి పైనాపిల్ పంటపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజ్‌కుమార్, పాలకొండ హార్టీకల్చర్ అధికారి జ్యోత్స్న, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment