
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలవరం విషయంలో దాఖలైన ఓ పిటిషన్ పై శుక్రవారం పర్యావరణ ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది.
ఈ క్రమంలో ప్రాజెక్టు పరిధి పెంచారా? అని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదిని ట్రిబ్యునల్ ప్రశ్నించింది. దీనికి బదులుగా 36 లక్షల క్యూసెక్కుల వరద నుంచి 50 క్యూసెక్కులకు మార్పు చేశామన్న సమాధానం వినిపించింది. ఆపై అదనంగా ముంపు ఎంత పెరిగిందని ప్రశ్నించగా.. అలాంటిదేం లేదని న్యాయవాది బదులిచ్చారు. కాగా, ఈ వాదనతో పిటిషనర్ విభేదించారు. ముంపుతో విపత్తు ఏర్పడుతుందని తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్ లో పేర్కొనటంతో.. సుప్రీంకోర్టులో ఇప్పటిదాకా ఉన్న పిటిషన్ల కాపీలన్నీ ఇవ్వాలంటూ ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
2019 కల్లా పోలవరం అసాధ్యం
పశ్చిమ గోదావరి : పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వమంతా గోల్ మాల్ వ్యవహారం నడుపుతోందని మసుద్ హుస్సేన్ కమిటీ ఇచ్చిన నివేదికతో స్పష్టమౌతోంది. 2019 కల్లా ప్రాజెక్టు పూర్తవటం అసాధ్యమని కమిటీ చెప్పటంతో చంద్రబాబు ప్రభుత్వం చెప్పేదానికి.. వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోయిందన్నది వెల్లడైంది. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 50 వేల కోట్లకు పెంచటం విస్మయం కలిగిస్తోంది. డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టకుండా ఆయకట్లు పనులు ఎలా చేపడతారోనని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. పునరావాసం పరివాసం కూడా రూ. 2,394 కోట్ల నుంచి 32 వేల కోట్లకు అంచనాల పెంపుపై కమిటీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఎంపిక చేసిన పునులే చూపిస్తూ.. కుడి, ఎడమ కాలువల్లో ఇప్పటికీ కొన్ని నిర్మాణాలు పూర్తి కాలేదని కమిటీ నివేదిక వెల్లడించింది. జల విద్యుత్ ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని.. కాపర్ డ్యామ్ ద్వారా 2018 కల్లా గ్రావిటీ నీళ్లు మళ్లీస్తామని చంద్రబాబు ప్రకటించారని.. కానీ, డ్యామ్ కోసం ఇంకా భూసేకరణే పూర్తి చేపట్టలేదని.. అలాంటప్పుడు చంద్రబాబు చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయిందన్నది స్పష్టమౌతోంది. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా.. ప్రాజెక్టు నిర్వాణంలో భారీ అవినీతి జరగుతుందోంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మసుద్ కమిటీ డొల్లతనం మొత్తం బయటపెట్టగా.. బల్‌రాజ్ జోషి కమిటీ నేడో, రేపో పోలవరం పనులను పరిశీలించనుంది.
Comments
Please login to add a commentAdd a comment