నిజాం షుగర్స్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం : కేటీఆర్ | nktr says we will under take nizam sugars | Sakshi
Sakshi News home page

నిజాం షుగర్స్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం : కేటీఆర్

Published Mon, Jan 13 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM

nktr says we will under take nizam sugars

 బోధన్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో నిజాం షుగర్స్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాం చక్కెర ఫ్యాక్టరీ స్థాపించి 75 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన వజ్రోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద చక్కెర ఫ్యాక్టరీగా పేరున్న నిజాం షుగర్స్‌ను చంద్రబాబు నష్టాల సాకు చూపి ప్రైవేటీకరించారని, వేలాది మంది కార్మికులను రోడ్డు పాలు చేశారని ధ్వజమెత్తారు. దాదాపు రూ.700 కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీ నాలుగు యూనిట్లను అప్పనంగా రూ.67 కోట్లకే ఆంధ్ర ప్రాంతానికి చెందిన అస్మదీయులకు అప్పగించారని ఆరోపించారు. దమ్ముంటే   కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ పెట్టాలని ఆయన సవాల్ విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement